ఖాళీ సమయం పూడ్చుకోవడానికి సినిమాలు సైన్ చేయాల్సిన స్థితిలో లేను: అనుష్క శర్మ
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గతేడాది రిలీజైన 'జీరో' తర్వాత ఒక్క సినిమాకు సైన్ చేయలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని పెళ్లాడిన ఆమె 2019 సంవత్సరంలో ఎక్కువగా తన భర్తతో కలిసి గడపటానికే ఆసక్తి చూపుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఐపీఎల్ మ్యాచుల్లో సందడి చేసిన అనుష్క... త్వరలో ప్రారంభం కాబోయే వన్డే వరల్డ్ కప్ సీజన్లో కోహ్లీ వెన్నంటి ఉండాలని నిర్ణయించుకున్నారు.
అనుష్క ఇప్పటి వరకు ఏ సినిమాకు సైన్ చేయక పోవడంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఆమె వివరణ ఇచ్చారు. సినిమాలు చేయకుండా తానేమీ ఖాళీగా లేనని, అయినా సమయం వృథా కాకుండా సినిమాలు సైన్ చేయాల్సిన స్థాయిలో తాను లేనని, అంతకు మించిన పొజిషన్లో ఉన్నట్లు తెలిపారు.
గత మూడేళ్లుగా సినిమాలపై పాషన్‌తో తీరిక లేకుండా పని చేశాను. ఒకే సంవత్సరం పారి, సూయి ధాగా, జీరో చిత్రాల్లో మంచి గుర్తింపు ఉన్న, కష్టంతో కూడిన పాత్రలు చేసినట్లు అనుష్క తెలిపారు. ఇప్పటి వరకు నటిగా తాను సాగించిన ప్రయాణంపై పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించారు.

నటిగా నా స్థాయికి తగిన పాత్రలు, నచ్చిన పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాను. అయితే నేను నటనతో పాటు నిర్మాణ రంగంలో కూడా ఉన్నాను. వాటి బాధ్యతలు చూసుకోవడానికి కూడా సమయం కావాలి. ఇపుడు తన ఫోకస్ అంతా ప్రొడక్షన్ మీదనే ఉన్నట్లు అనుష్క శర్మ తెలిపారు. 2015లో ఎన్‌హెచ్ 10 సినిమాతో ఆమె నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క శర్మ రొటీన్‌కు భిన్నంగా ఉండే కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వెబ్ సిరీస్ ప్రాజెక్టులు నిర్మించేందుకు ఆసక్తి చూపుతుందట. సినిమాలు సైన్ చేయక పోవడానికి అనుష్క ఎన్నికారణాలు చెబుతున్నా... ప్రధాన కారణం తన భర్త విరాట్ కోహ్లితో కలిసి గడపటానికే అనేది కాదనలేని వాస్తవం.


Click it and Unblock the Notifications











