నాకు 15 మంది భర్తలు: అమలా పాల్ కామెంట్‌తో అంతా ఆశ్చర్యం!
అమలా పాల్ త్వరలో 'ఆడై' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అనురాగ్ కశ్యప్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ చిత్రంలో అమలా పాల్ కామిని అనే విభిన్న మనస్తత్వం గల యువతిగా కనిపించబోతోంది.
అహంకారం, సాహసం, కళాత్మక మనస్తత్వం గల కామిని ప్రేక్షకులకు ఏ స్థాయిలో వినోదం పంచబోతోంది అనేది ఈ ట్రైలర్ ద్వారా చెప్పే ప్రయ్నం చేశారు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో అమలా పాల్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి.

15 మంది భర్తలు ఉన్నట్లు ఫీలయ్యాను
‘ఆడై' షూటింగ్ సమయంలో నేను చాలా సేఫ్, సెక్యూర్‍గా ఫీలయ్యాను. ఎందుకంటే 15 మంది టెక్నీషియన్స్ నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. ‘పంద్రాలి'(15 మంది భర్తలు కలిగిన మహిళ) అనే ఫీలింగ్ వచ్చింది అంటూ అమాలా పాల్ వ్యాఖ్యానించారు.

సంచలనం రేపుతున్న ఆడై ట్రైలర్
‘ఆడై' ట్రైలర్ సంచలనం రేపుతోంది. ఇందులో అమలా పాల్ విచ్చలవిడి మనస్తత్వం గల, ప్రతి విషయానికి బెట్టింగ్ కట్టే యువతిగా కనిపించబోతోంది. అబ్బాయిలతో కలిసి తిరుగుతూ, ధూమపానం, మద్యపానం చేస్తూ... మహిళగా తనకు లభించిన స్వేచ్ఛను దుర్వినయోగం చేస్తున్న యువతిగా కనిపించింది.

పుట్టడం బట్టలతో పుట్టమా.. ఏమిటి?
ట్రైలర్‌లోని ఓ సీన్లో.... అబ్బాయిలతో మందు కొడుతూ కనిపించిన కామిని ‘మనమంతా పుట్టుకతోనే బట్టలేసుకుని పుట్టామా? అన్నీ విప్పేసి నగ్నంగా ఉంటేనే నిజమైన బర్త్ డే డ్రెస్' అంటూ చెప్పే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇంతకు ముందు విడుదలైన టీజర్లో అమలా పాల్ నగ్నంగా కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో కథ ఎలాంటి మలుపులతో సాగుతుంది అనేది చర్చనీయాంశం అయింది.

ఆడై/ఆమె
‘ఆడై' చిత్రం తెలుగులో ‘ఆమె' పేరుతో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో అమలా పాల్ నటనకు అవార్డులు ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమిళ చిత్రం 'మయాతా మాన్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రత్నకుమార్ దర్శకత్వం వహిస్తుండగా 'వి స్టూడియోస్' సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.


Click it and Unblock the Notifications











