ప్రేమించాడనుకుని మోసపోయా.. అంతా నటన.. శిల్పా శెట్టి!
పొడుగు కాళ్ళ సుందరి శిల్పా శెట్టి తాజగా తన ప్రేమ వ్యవహారాల గురించి నెమరు వేసుకుంది. శిల్ప శెట్టి హియర్ మి, లవ్ మి షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ షో గురించి మాట్లాడుతూ.. ఇలాంటి షోలతో ఆడియన్స్ మంచి వినోదాన్ని పొందుతారని శిల్పా శెట్టి తెలిపింది. తన టీనేజ్ లో ఓ అబ్బాయితో ప్రేమలో పడ్డ విషయాన్ని శిల్పాశెట్టి బయట పెట్టింది.

కాలేజీలో ఉన్నప్పుడు
నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో ఈ ఘటన జరిగింది. నాతోపాటు చదువుకునే ఓ అబ్బాయి రోజు సాయంత్రం మా ఇంటికి ఫోన్ చేసేవాడు. నేను కూడా అతడితో మాట్లాడేదాన్ని. నన్ను ప్రేమిస్తున్నాడని అనుకున్నా. మా నాన్న ఇంట్లో ఉన్న సమయంలో ఫోన్ కట్ చేసేదాన్ని అని శిల్పా శెట్టి తెలిపింది.

బస్‌స్టాప్‌కు పిలిచాడు
కలుసుకోవడానికి ఒకరోజు బస్ స్టాప్ కు రమ్మని పిలిచాడు. అతడి కోసం చాలా సమయం అక్కడే ఎదురుచూశా. అతడు మాత్రం రాలేదు. తాను మోసపోయాననే సంగతి మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందని శిల్పా శెట్టి తెలిపింది.

ప్రేమిస్తున్నట్లు నటించాడు
అతడి గురించి మా ఫ్రెండ్స్ చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయానని శిల్పా శెట్టి తెలిపింది. ఫ్రెండ్స్ తో కట్టిన పందెం వలనే నన్ను ప్రేమిస్తున్నట్లు నటించాడు. ఆ సంఘటనతో చాలా బాధపడ్డా. కథలా అనిపించినా ఇది నిజం అని శిల్పా శెట్టి తెలిపింది.

బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ
శిల్పా శెట్టి కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాను తిరిగి బాలీవడ్ చిత్రాల్లో నటించాలనే కోరికని శిల్పా శెట్టి బయట పెట్టింది. వయసుకు తగ్గ పాత్రలు చేయడానికే మొగ్గు చూపుతానని, లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటించాలని ఉందని శిల్పా శెట్టి తెలిపింది.


Click it and Unblock the Notifications











