స్టార్ హీరో రేంజిలో భారీ కటౌట్లు.. నేను అర్హురాలినే అంటున్న సమంత!
సమంత నటించిన 'ఓ బేబీ' చిత్రం ఈ నెల 5న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. గత నెల రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానులు, సినీ ప్రేమికుల్లో ఈ మూవీపై ఆసక్తి పెరుగుతోంది.
'ఓ బేబీ' రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎం థియేటర్ వద్ద సమంత భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. సాధారణంగా హీరోయిన్లకు ఈ స్థాయిలో స్టార్ ట్రీట్మెంట్ ఉండదు. అభిమానులు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో ఆమె ఆనందంతో పొంగిపోయారు.

'ఇలాంటి గౌరవానికి నేను అర్హురాలినే అనుకుంటున్నాను' అంటూ సమంత వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె... పెళ్లి తర్వాత కూడా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన స్టార్ స్టేటస్ మరంత పెంచుకోవడంలో సక్సెస్ అయ్యారు.
నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓ బేబీ' మూవీని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సురేష్ బాబు, సునీత తాటి, టిజి విశ్వప్రసాద్, హ్యూనవూ థామస్ కిమ్ నిర్మాతలు.
'ఓ బేబీ' చిత్రంలో సమంత డెబ్బై ఏళ్ల ముసలమ్మ పాత్రలో... 20 యువతి పాత్రలో కనిపించబోతోంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు రాని ఒక విభిన్నమైన కథతో ఈ చిత్రం ప్రేక్షకులను భిన్నమైన అనుభూతిని పంచబోతోంది.


Click it and Unblock the Notifications











