మీ కలలో మగాడిని నేనే.. సెక్స్ మార్పిడి ఊహించలేదంటున్న అదా శర్మ
హార్ట్ ఎటాక్, క్షణం చిత్రాల్లో తన క్యూట్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న హీరోయిన్ అదా శర్మ త్వరలో ఓ విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లింగమార్పిడి చేసుకుని స్త్రీగా మారిన మగాడి పాత్రలో కనిపించబోతోంది. 'మ్యాన్ టు మ్యాన్' పేరుతో రూపొందుతున్న ఈ బాలీవుడ్ చిత్రానికి అబిర్ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.
మగాడిగా పుట్టిన ఒక వ్యక్తి లింగమార్పిడి చికిత్స ద్వారా స్త్రీగా మారి, మరొక మగాడికి ప్రేమించి, పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగింది? తనను పెళ్లాడిన వ్యక్తి అసలు విషయం తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? అనేది రొమాంటిక్ కామెడీ స్క్రీన్ ప్లేతో చూపించబోతున్నారు.

మీ కలలో కనిపించే మగాడిని నేనే
అదా శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ‘మ్యాన్ టు మ్యాన్' మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖానికి మీసాలు అంటించుకుని ఉన్న హాట్ ఫోటో షేర్ చేసిన అదా... ‘మీ కలలో కనిపించే మగాడిని నేనే' అంటూ క్యాప్షన్ పెట్టారు.

ఇలాంటి పాత్ర చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు
‘‘నేను నటిగా కెరీర్ మొదలు పెట్టినపుడు ఒక మగాడి పాత్ర చేస్తానని అస్సలు ఊహించలేదు. కానీ ఇపుడు చేస్తున్నాను. ఇదొక యూనిక్ లవ్ స్టోరీ, రొమాంటిక్ కామెడీ కాన్సెప్టుతో సాగే వినోదాత్మక చిత్రం. సెక్స్ మార్పిడి ద్వారా మహిళగా మారిన ఒక వ్యక్తి... మరో మగాడిని పెళ్లాడితే ఎలా ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను'' అంటూ అదా శర్మ ట్వీట్ చేశారు.

నవీన్ కస్తూరియా, అదా శర్మ
నవీన్ కస్తూరియా పాత్ర చుట్టూ ‘మ్యాన్ టు మ్యాన్' కథ తిరుగుతుంది. ఆదా శర్మ అందం చూసి ప్రేమలో పడ్డ అతడు... తాను పెళ్లాడింది మహిళను కాదని, సెక్స్ మార్పడి ద్వారా సర్జరీ చేయించున్న మరొక మగాడిని అని తెలిసి షాకవుతాడు. ఈ క్రమంలో జరిగే కథను దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇండియన్ తరపై యూనిక్ మూవీ
ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి విభిన్నమైన కథతో సినిమా రాలేదు. సినిమాను వినోదాత్మకంగా నడిపిస్తూనే ట్రాన్స్ జెండర్స్ సమస్యలు ఈ చిత్రంలో చర్చిస్తారని తెలుస్తోంది. కథ వినడానికే ఇలా ఉందంటే... రేపు విడుదలైన తర్వాత ‘మ్యాన్ టు మ్యాన్' చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











