twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆకలి నేరమా? పాపం మరో ఛాన్స్ ఇవ్వండి.... హీరోయిన్ సంచలన ట్వీట్!

    |

    ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్స్ అందించే సంస్థల జోరు పెరిగింది. జొమాటో లాంటి కార్పొరెట్ కంపెనీలు భారీగా ఆఫర్లు గుప్పించి సగం ధరకే రెస్టారెంట్స్ ఫుడ్ డెలివరీ చేస్తుండటంతో చాలా మంది దీనికి అలవాటు పడ్డారు. అలా ఆర్డర్స్ చేసే వారికి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో షాకిచ్చింది.

    'జొమాటో'కు చెందిన ఓ డెలివరీ బాయ్ కస్టమర్స్ ఆర్డర్ చేసిన ఫుడ్ సగం తినేసి మళ్లీ దాన్ని ప్యాక్ చేసి వాళ్లకు అందించడం సంచలనం రేపింది. మధురైకు చెందిన డెలివరీ బాయ్ ఇలా చేశాడని గుర్తించిన సదరు సంస్థ అతడిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. అయితే దీనిపై హీరోయిన్ సంజన స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

    ఆకలి నేరమా?

    విధుల నుంచి తొలగించబడిన వ్యక్తి ఫోటో షేర్ చేసిన సంజన... అతడికి మద్దతుగా మాట్లాడింది. ఆకలి నేరమా? అతడికి తన తప్పు సరిదిద్దుకోవడానికి మరొక ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు? అంటూ ప్రశ్నించింది.

    దోపిడీ చేయలేదు కదా... దయచేసి వదిలేయండి

    దోపిడీ చేయలేదు కదా... దయచేసి వదిలేయండి

    అతడికి ఆకలి వేయడంతో దాన్ని తిన్నాడే తప్ప.... జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో వేరొకరి ఇంట్లో దొంగతనం, దోపిడీ లాంటి నేరాలకు పాల్పడలేదు. అతడికి మరొక ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు అతడిని కాపాడాలి. అతడి నేరం ఆకలి మాత్రమే... అని సంజన వ్యాఖ్యానించారు.

     నమ్రత మరోలా..

    నమ్రత మరోలా..

    అయితే ఈ జొమాటో డెలివరీ బాయ్ తీరుపై మహేష్ బాబు భార్య నమ్రత మరో విధంగా స్పందించారు. ఈ వీడియో చూసిన తర్వాత ఫుడ్ డెలివరీ కంపెనీలు పని చేసే తీరు చూసి షాకయ్యాను. ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే కష్టమర్స్ పరిశ్రమైన ఆహారాన్ని ఆశిస్తారు? ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించరు. ఈ డెలివరీ బాయ్ వర్క్ ఎథిక్స్ పాటించకుండా కష్టమర్లను మోసం చేస్తున్నాడు. ఇకపై ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఒకసారి ఆలోచించండి. నా పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడాన్ని ఎంకరేజ్ చేయను అని వ్యాఖ్యానించారు.

    మీరేమంటారు?

    మీరేమంటారు?

    జొమాటో డెలివరీ బాయ్ వ్యవహారంలో.... సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు? సంజన వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా? నమ్రత శిరోద్కర్ అభిప్రాయానికి సపోర్ట్ చేస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో వెల్లడించండి.

    English summary
    "This is the person who hit headlines for eating from parcel of Zomato customer . Now Zomato says he is caught and fired at Madurai. Now the question arises. 1) Is hunger a crime 2)Why not he be given chance to reform 3) Guys he just ate food . He did not loot some one’s house in guise of Zomato delivery guy. May be Zomato will have better delivery policy now onwards But God save this poor chap ... His Crime is Hunger , I say give him a #secondchance ." Sanjana tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X