అమ్మ, నేను చాలా కష్టపడ్డాం... అప్పుడు నా టార్గెట్ రూ. 50 లక్షలే: సమంత
'ఏమాయ చేశావే' సినిమా ద్వారా కెరీర్ మొదలు పెట్టిన సమంత... తొలి సినిమా హిట్ కావడం, ఆ తర్వాత వరుసగా విజయాలు సొంతం చేసుకోవడంతో ఎలాంటి స్ట్రగుల్ లేకుండానే ఇండస్ట్రీలో ఎదిగింది. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది.
మోడలింగ్ రంగం నుంచి అనుకోకుండా సినిమాల వైపు వచ్చిన తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. కట్ చేస్తే... ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదా, గౌరవం... నాగ చైతన్యతో ప్రేమ పెళ్లి ద్వారా అక్కినేని కుటుంబంలోకి కోడలిగా ప్రవేశం ఇలా ఆమె జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అయితే తన జీవితంలో ఇవన్నీ జరుగడాని కారణం సినిమానే అంటోంది సామ్. సినిమాల్లోకి రాక ముందు జీవితంలో చాలా కష్టాలు పడిందట.

అమ్మ, నేను చాలా కష్టపడ్డాం..
సినిమాల్లోకి రాక ముందు అమ్మ, నేను చాలా కష్టాలు పడ్డాం. కొన్ని సందర్భాల్లో ఇతరులు మాకు సహాయం చేశారు. మన చేతిలో డబ్బులేక కష్టాల్లో ఉన్నపుడు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. ఆ పెయిన్ తెలుసు కాబట్టే తనకు తోచిన విధంగా సహాయం చేస్తుంటానని సమంత చెప్పుకొచ్చారు.

అప్పుడు నా టార్గెట్ రూ. 50 లక్షలే
మాది చాలా సమాన్యమైన కుటుంబం. అవసరానికి సరిపడ డబ్బు లేక కష్టపడ్డ రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో నా టార్గెట్ ఒకటే ఉండేది. సొంత ఇల్లు, బ్యాంక్ అకౌంట్లో రూ. 50 లక్షల క్యాష్ ఉంటే చాలు అనుకునేదాన్ని... కానీ దేవుడు నేను కోరుకున్నదానికంటే ఎక్కువే ఇచ్చాడని సమంత తెలిపారు.

హీరోయిన్ల పరిస్థితి అంతే...
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. వరుసగా హిట్స్ వస్తే గోల్డెన్ లెగ్ అంటారు. అదే సినిమా సరిగా ఆడకపోతే హీరోయిన్ తప్పు చేసినట్లుగా చూస్తారు, ఐరన్ లెగ్ అని పక్కన పెడతారు. ఆమెకు అందులో సరైన ప్రాధాన్యం ఉన్న పాత్ర లేకున్నా... పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది. దర్శకుడినో, ఆమె పాత్ర అలా రాసిన రచయితనో తప్పుబట్టే ప్రయత్నం అయితే జరుగదని సమంత అభిప్రాయ పడ్డారు.

సమంత
సమంత నటిస్తున్న ‘ఓ బేబీ' సినిమా విషయానికొస్తే నందినీ రెడ్డి దర్శకత్వం వహించి ఈ చిత్రం జులై 5న విడుదల కాబోతోంది. ప్రస్తుతం సామ్ ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఇందులో ఆమె 20 ఏళ్ల అమ్మాయిగా 60 ఏళ్ల వృద్దురాలిగా కనిపించబోతున్నారు. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ'కి ఇది రీమేక్.


Click it and Unblock the Notifications











