బలవంతం చేయలేదు, ఎవడైనా అలా అంటే చెంప చెల్లుమనిపిస్తా.. భగ్గుమన్న హాట్ బ్యూటీ!

Recommended Video

'If Anyone Calls Me An Item, I’ll Slap Them’ Says Malaika Arora || Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ప్రత్యేక గీతాలతో సూపర్ పాపులర్ అయ్యారు. ఆమె చేసిన చెయ్య చెయ్య.. మున్ని బదనాం హుయే, అనార్కలి లాంటి సాంగ్స్ సెన్సేషనల్ హిట్ అయ్యాయి. తెలుగులో గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వుకేక పాటతో టాలీవుడ్ మొత్తాన్ని ఒక ఊపు ఊపింది.

ఆమె సినిమాల్లో ఎక్కువగా ఐటం నంబర్స్ చేసింది కాబట్టి సాధారణంగానే అందరూ ఐటం గర్ల్ అని పిలవడం మొదలు పెట్టారు. అయితే అలా పిలిపించుకోవడం అమ్మడుకి అస్సులు నచ్చడం లేదు. ఎవరైనా తనను అలా పిలిస్తే చెంప చెల్లుమనిపిస్తానంటోంది.

ఎవరి బలవంతంతో చేయలేదు

ఎవరి బలవంతంతో చేయలేదు

తాజాగా అనుపమ్ చోప్రా ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ..‘‘నేను ఏ సాంగ్ చేసినా నా ఇష్టపూర్వకంగా చేశాను, ఎవరి బలవంతంతో చేసింది కాదు. నాకు అవి చేయడం కంఫర్టుగా ఉంది.'' అని తెలిపారు. ‘‘సాంగ్ చేసేపుడు ఏదైనా స్టెప్ నాకు నచ్చకపోతే వెంటనే నా ఒపీనియన్ చెప్పేస్తాను.'' అన్నారు.

ఐటం అంటే చెంప చెల్లుమనిపిస్తా

ఐటం అంటే చెంప చెల్లుమనిపిస్తా

‘నేను చేసే ప్రత్యేక గీతాలను ఎవరైనా ఐటం సాంగ్స్ అని పిలిచినపుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే సమయంలో ఎవరైనా నన్ను చూసి ఐటమ్ అనిపిస్తే నాకు చిర్రెత్తుకొస్తుంది. వెంటనే అలా అన్న వ్యక్తి చెంప చెల్లుమనిపిస్తాను. ఒక మనిషిని వస్తువుగా చూడటం అనేది చాలా దారుణం' అని మలైకా చెప్పుకొచ్చారు.

వల్గారిటీ లేదు

వల్గారిటీ లేదు

80, 90ల్లో వచ్చే పాటల్లో వల్గారిటీ కాస్త ఉండేది. కానీ ఇప్పటి దర్శకులు తమ సినిమాల్లో అలాంటి సాంగ్స్ పెట్టాలనుకోవడం లేదు. వారు తమ చిత్రాల్లో పాటలు ప్రత్యేకంగా, ప్రేక్షకులకు వినోదం కల్పించే విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. నేను చేసిన ప్రత్యేక గీతాలన్నీ అలాంటి కోవకు చెందినవే అని మలైకా చెబుతోంది.

అర్జున్ కపూర్‌తో రిలేషన్ షిప్ గురించి

అర్జున్ కపూర్‌తో రిలేషన్ షిప్ గురించి

అర్జున్ కపూర్‌తో రిలేషన్ షిప్ గురించి మీడియాలో వస్తున్న రూమర్లపై కూడా మలైకా రియాక్ట్ అయ్యారు. తమ గురించి జరుగుతున్న హడావుడి అంతా మీడియా సృష్టించే అన్నారు. ‘‘ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి ప్రేమ, సాహచర్యం వెతుక్కుంటూ ముందుకు వెళ్లాలనుకుంటారు.. మీరు కోరుకున్నది దొరికితే అదృష్ట వంతులే, మీరు సంతోషంగా ఉండటానికి మరో ఛాన్స్ దక్కినట్లు అవుతుంది'' అని మలైకా చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X