‘ప్రభాస్‌తో డేటింగ్ చేయాలని ఉంది.. రెబల్‌స్టార్‌తో అలా సింక్ అవుతా’
బాహుబలి చిత్రం బాక్సాఫీస్ వద్ద చేసిన మ్యాజిక్‌తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యారు. దాంతో దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా ఆయనకు విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పడింది. సాధారణంగా అమ్మాయిలే కాకుండా సెలబ్రిటీలు, సినిమా స్టార్స్ కూడా క్రష్ ఏర్పడింది. ప్రభాస్ అంటే తమకు ఎంత ఇష్టమే అనే విషయాన్ని, అలాగే ఇప్పటికే పలువురు హీరోయిన్లు బాహటంగా మనసు పారేసుకొన్న తీరును మీడియాలో వెల్లడించారు. తాజాగా బాలీవుడ్‌లోను, అలాగే టాలీవుడ్‌లోను రాణించిన ఓ హీరోయిన్ కూడా తాజాగా తన మనసులోని మాటను చెప్పేసింది. ఆ బ్యూటీ చెప్పిన వివరాల్లోకి వెళితే..
సినిమా నటించాలనే పిచ్చితో కొన్ని డాక్యుమెంటరీలు, కెనడియన్ ఫిలింలో నటించడంతో పాయల్ ఘోష్ నటిగా అడుగులు వేశారు. అయితే ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో కోల్‌కతా నుంచి పారిపోయి వచ్చి ముంబైలో వాలిపోయింది. ముంబైలో యాక్టింగ్ స్కూల్‌లో చేరిన ఆమెకు తెలుగులో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిన ప్రయాణం అనే సినిమాలో బ్రేక్ లభించింది. ఆ తర్వాత మిస్టర్ రాస్కెల్, అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తో ఊసరవెళ్లి సినిమాల్లో నటించింది.

అయితే జూనియర్ ఎన్టీఆర్‌పై అభ్యంతరకరమైన కామెంట్స్ చేయడంతో ఆమెను యంగ్ టైగర్ ఫ్యాన్స్ భారీగా ట్రోల్ చేయడం వివాదాస్పదంగా మారింది. దాంతో ఎన్టీఆర్, ఆయన ఫ్యాన్స్‌తో ట్విట్టర్‌లో యుద్దమే చేసింది. అయితే చివరకు ఇరువైపుల శాంతించడంతో ఆ వివాదం సద్దుమణిగింది. అయితే ఈ క్రమంలో తాజాగా ఓ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి.. తనకు సంబంధించిన విషయాలను పంచుకొన్నారు.
తాను సినిమాల్లోకి రాకపోతే ఏదో మంచి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్ అయ్యేదాన్ని. నేను చిన్నప్పటి నుంచి చదువల్లో ముందు ఉండేదాన్ని. నన్ను ప్రొఫెషనల్‌గా మంచి పోజిషన్‌లో చూడాలని నా ఫ్యామిలీ అనుకొన్నది. వారికి నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. నా కాలేజీ డేస్‌లో మా ఏరియాలోని కుర్రకారంతా నా వెనుక పడేవారు. నాకు బ్లాంక్ కాల్స్ ఇచ్చేవారు. దాంతో నాలో ఏదో స్పెషల్ ఉందనే ఫీలింగ్‌లో సినిమాల్లోకి రావాలని అనుకొన్నాను అని పాయల్ ఘోష్ చెప్పారు.
ఇక ఇప్పుడున్న హీరోలలో నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఇష్టమే కాదు.. పీకల్లోతు క్రష్. ఛాన్స్ వస్తే నేను ప్రభాస్‌తో డేటింగ్ చేయాలని అనుకొంటున్నాను. అతను వైట్ షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకొంటే.. కురచగా ఉండే నేను బ్లాక్ డ్రస్ వేసుకొని సింక్ అవుతాను అని సిగ్గుపడుతూ తన క్రష్‌ను బయటపెట్టింది. పాలిటెంట్‌లైఫ్ అనే ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
పాయల్ ఘోష్ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో ఆమె నటించిన చిత్రం మిస్టర్ రాస్కెల్. హిందీలో పటేల్ కి పంజాబీ షాదీ, కోయి జానే నా అనే సినిమాల్లో నటించింది. 2021 తర్వాత ఆమె నటించిన దాఖలాలు లేవు. కానీ ఆమె అథవాలే స్థాపించిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీలో చేరి రాజకీయ ప్రవేశం చేసింది. ఆ పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా సేవలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











