మా అమ్మతో కలిసి నటించాలని ఉంది: శృతి హాసన్
హీరోయిన్ శృతి హాసన్ తన తల్లి సారికతో కలిసి నటించాలని ఉందంటూ మనసులోని కోరికను బయట పెట్టింది. 'అమ్మతో కలిసి పని చేయాలని ఎప్పటి నుండో ఉంది. అందుకే ఇద్దరం కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ రన్ చేస్తున్నాం. నాన్నతో కలిసి పలు సినిమాలకు పని చేశాను. అమ్మతో కలిసి చేయాలనేది నా కోరిక' అని శృతి హాసన్ ముంబైలో మీడియాతో వ్యాఖ్యానించారు.
"అమ్మా, నాన్న నాలుగు సంవత్సరాల వయసులోనే సినిమా రంగంలో కెరీర్ మొదలు పెట్టారు. వారిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి నేను ఈ రంగం వైపు వచ్చాను. తమ కూతురును చూసి వారు గర్వపడేలా నా కెరియర్ మలచుకుంటున్నాను. నేను కష్టపడి పని చేస్తున్నానని వారికి తెలుసు, నా విషయంలో వారికి ఆ సంతృప్తి ఉండటమే నాకు ముఖ్యం.' అని శృతి హాసన్ తెలిపారు.

నాకు నచ్చిన విధంగా నేను పని చేసుకుంటూ ముందుకు వెళతాను. వారితో పోల్చుకుని పోటీ పడటం అనేది అసాధ్యం. నాపై ఎలాంటి అంచనాలు ఉండాలని కోరుకోవడం లేదు శృతి హాసన్ స్పష్టం చేశారు.
"ఇసిడ్రో మీడియా" పేరుతో శృతి హాసన్ సొంత బేనర్ స్థాపించింది. డిజిటల్ మీడియాలో క్రియేటివ్ కంటెంట్ అందించడమే లక్ష్యంగా తన సంస్థను విస్తరించడానికి ఈ చెన్న బ్యూటీ చాలా పెద్ద ప్లాన్సే వేసుకుంది. ఆమె ప్రస్తుత సినిమాల విషయానికొస్తే... తండ్రి కమల్ హాసన్‌తో కలిసి చేసిన శభాష్ నాయుడు విడుదల కావాల్సి ఉంది. దీంతో పాటు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో హిందీలో ఓ చిత్రం చేస్తోంది.


Click it and Unblock the Notifications











