twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను నో చెప్పినా పవన్ కళ్యాణ్ ఒప్పించారు, 7 నెలలు కష్టపడ్డాను : రేణు దేశాయ్

    |

    పవన్ కళ్యాణ్‌తో బద్రి, జానీ చిత్రాల్లో నటించిన రేణు దేశాయ్ తొలి సినిమా సమయంలోనే అతడికి దగ్గరైన సంగతి తెలిసిందే. కొంతకాలం సహజీవనం చేసిన ఇద్దరూ అకీరా జన్మించిన తర్వాత వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అతడితో విడిపోయిన రేణు దేశాయ్... పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేసిన రోజులనాటి ఫోటోస్ ఏమైనా తన దృష్టికి వస్తే అభిమానులతో పంచుకుంటారు.

    ఆ కుక్కను చూసి అంతా భయపడేవారు: 'ఖుషి' జ్ఞాపకాల్లోకి వెళ్లిన రేణు దేశాయ్ఆ కుక్కను చూసి అంతా భయపడేవారు: 'ఖుషి' జ్ఞాపకాల్లోకి వెళ్లిన రేణు దేశాయ్

    తాజాగా రేణు దేశాయ్ 'జానీ' సినిమా సమయంలో తీసిన ఓ ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయడం తనకు ఇష్టం లేదని, షూటింగ్ ప్రారంభం అవ్వడానికి రెండు వారాల ముందు తనను పవన్ కళ్యాణ్ ఒప్పించాడని తెలిపారు.

    ‘జానీ' సినిమాకు నేను ప్రొడక్షన్ డిజైనర్

    ‘జానీ' సినిమాకు నేను ప్రొడక్షన్ డిజైనర్

    ‘జానీ' సినిమాకు నేను తొలుత ప్రొడక్షన్‌ డిజైనర్‌గా ఎంపికయ్యాను. కేవలం షూటింగ్‌కి రెండు వారాల ముందు నన్ను హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. హీరోయిన్‌గా చేయాలని చెప్పగానే నా ఫస్ట్ రియాక్షన్ ‘చేయను' అని చెప్పేశాను ఎందుకంటే నా మనసంతా ప్రొడక్షన్‌ డిజైనింగ్‌, సాంకేతిక పరమైన అంశాలపైనే ఉంది... అని రేణు దేశాయ్ గుర్తు చేసుకున్నారు.

    పవన్ కళ్యాణ్ ఒప్పించారు

    పవన్ కళ్యాణ్ ఒప్పించారు

    నేను హీరోయిన్‌గా చేయను అని చెప్పినా... కళ్యాణ్ గారు మొత్తానికి నేను కన్విన్స్ అయ్యేలా చేశారు. 21 ఏళ్ల వయసులో ఇటు ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ హీరోయిన్‌గా చేయడం అంటే అదొక క్రేజీ టాస్క్... అని రేణు దేశాయ్ గుర్తు చేసుకున్నారు.

    7 నెలలు చాలా కష్టపడ్డాను

    7 నెలలు చాలా కష్టపడ్డాను

    ఇటు నటిస్తూ... అటు ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ 7 నెలల పాటు రోజుకు 16 నుంచి 17 గంటలు కష్టపడ్డాను. ఈ అనుభవం నన్ను మరింత స్ట్రాంగ్ చేసింది. భావోద్వేగాల పరంగా కూడా ఎంతో మార్పు వచ్చింది అని తెలిపారు.

    భయపడి పారిపోకూడదు

    భయపడి పారిపోకూడదు

    ప్రతి రోజూ ప్రొడక్షన్ డిజైనర్‌గా సెట్స్‌కు రావడం, అన్ని ఆర్డర్‌లో ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకోవడం... తర్వాత మేకప్ రూముకు వెళ్లి హీరోయిన్‌గా సిద్ధమై రావడం చేసేదాన్ని, కొన్ని సందర్భాల్లో జీవితం మనల్ని ఛాలెంజ్ చేస్తున్నపుడు భయపడి పారిపోకూడదు. అప్పుడే వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకుంటాం... అని రేణు దేశాయ్ పేర్కొన్నారు.

    ఈ ఫోటోలో ఉన్నది శ్యాం దాదా

    ఈ ఫోటోలో ఉన్నది శ్యాం దాదా

    ఈ ఫోటోలో నా వెనక ఉన్నది డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ శ్యాం దాదా. షాట్ గురించి కళ్యాణ్ గారితో చర్చిస్తున్నారు... అని రేణు దేశాయ్ తెలిపారు.

    English summary
    "I was initially only the production designer for Johnny and just 2 weeks before shoot, I was casted as the heroine. My first reaction was a strict No for acting to Kalyan garu because i was not interested in acting, as my heart lay in the behind the camera technical stuff. And also, it would have been a crazy task to be the heroine and the production designer at the age of 21 only. But Kalyan garu convinced me eventually and I ended up working almost 16-17 hours everyday for more than 7 months.This one experience made me super strong and resilient emotionally. I used to come to the set as a Production designer, check everything is in order and then go to the make up room to become the heroine. When life throws a challenge at you, don’t shy away. Take it head on and see your self growing professionally and personally too. Behind me is Shyam dada(DOP) discussing the shot with Kalyan garu." Renu Desai said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X