లైంగిక వేధింపులు తప్పవన్నారు - రాధికా ఆప్టే
రొటీన్ కు భిన్నమైన సబ్జెక్ట్ లతో ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రేక్షకులను మైమరపించడం రాధికా ఆప్టేకు వెన్నెతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. కథలో దమ్ముంటే బోల్డ్ గా కనిపించేందుకు వెనుకాడని రాధికా, తెరపై సృష్టించిన సంచనలనాలకు కొదవే లేదు. అయితే, తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీ కెరీర్ స్టార్టంగ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాలపై పెదవి విప్పింది.
సినిమాల్లో కెరీర్ కోసం పూనే నుంచి ముంబైకు మకాం మార్చుదాం అనుకుంటోన్న సమయంలో, ఆమె నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారని రాధిక వెల్లడించింది. బాలీవుడ్ ఒక నరక కూపమని అందులోకి దిగితే బయటకు రాలేమని తనని నిరుత్సాహపరచిన వైనాన్ని వివరించింది. అంతేకాదు. కొంతమంది మరో అడుగు ముందుకేసి అక్కడికి వెళితే లైంగిక వేధింపులు తప్పని హెచ్చరించారని తెలిపింది.

అయితే తనని ఎంతగా జనాలు నిరుత్సాహ పరచాలనుకున్నా తాను వెనకడుగు వేయలేదని, అందుకే ఈరోజు తానీ పొజిషన్ లో ఉన్నానని తెలిపింది. మరోవైపు నెట్ ఫ్లిక్స్ తో మంచి అనుబంధం కలిగిన రాధికా ఆప్టే, వరుసగా అదే ప్లాట్ ఫార్మ్ కు పనిచేయడంపై స్పందించింది. ఆ సంస్థతో తనకు మంచి అనుబంధం ఉందని వెల్లడించింది.
సాధారణంగా పెద్ద సినిమాల రేసులో చిన్న సినిమాలు రిలీజ్ కు థియేటర్లను వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని, కానీ, నెట్ ఫ్లిక్స్ లో క్వాలిటీ సినిమాలు మాత్రమే జనాదారణ చూరగొంటున్నాయని తెలిపింది. ప్రస్తుతం రాధిక నటించిన రాత్ అకేలీ హై నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











