అతడితో ప్రేమ నిజమే, పిల్లలు కావాలనుకున్నపుడే పెళ్లి: తాప్సీ
తాప్సీ నటించిన బాలీవుడ్ మూవీ 'మన్మర్జియాన్' ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమాలో తాప్సీ పోషించిన పాత్రకు, రియల్ లైఫ్‌లో తాప్సీ ఆలోచన విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. సినిమాలో పెళ్లి ఇప్పుడే వద్దన్న తన ప్రియుడు(విక్కీ కౌశల్)తో విభేధించి అభిషేక్ బచ్చన్‌తో వివాహానికి సిద్ధమయ్యే పాత్రలో తాప్సీ నటించింది. అయితే రియల్ లైఫ్‌లో మాత్రం.... సంతోషంగా ఉండటానికి పెళ్లి అవసరం లేదు, పిల్లలు కనే సమయానికి చేసుకుంటే చాలు, అప్పటి వరకు లివ్ ఇన్ రిలేషన్ షిప్ ఎంజాయ్ చేయడం ఉత్తమం అని వాదిస్తోంది. ఈ మేరకు ఓ ఆంగ్లపత్రికతో తన మనసులోని అభిప్రాయాన్ని వెల్లడించింది.

బాడ్మింటన్ క్రీడాకారుడితో తాప్సీ ప్రేమాయణం
డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోతో తాప్సి కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతోంది. ఈ నేపథ్యంలో మథియాస్‌తో రిలేషన్ షిప్ ఇంకాస్త ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? మీ పెళ్లి త్వరలో ఎక్స్‌పెక్ట్ చేయవచ్చా? అనే ప్రశ్నకు తాప్సీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు
ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఇంకా నయం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటపుడు నా పక్కన అభిషేక్ బచ్చన్ లేడు. ఉంటే నా సమాధానాలకు విని ఆటపట్టించేవాడు.... అని తాప్సీ వ్యాఖ్యానించారు.

పిల్లలు కావాలనుకున్నపుడే పెళ్లి
నాకు ఎప్పుడు పిల్లలు కావాలనుకుంటే అప్పుడే పెళ్లి చేసుకుంటాను. ఒక మాత్రం క్లియర్.... పెళ్లి చేసుకున్న తర్వాతే పిల్లలను కంటాను. ముందే పిల్లల్ని కనే ప్రయత్నం అస్సలు చేయను... అని తాప్సీ తెలిపారు.

అలా కూడా సంతోషంగా ఉండొచ్చు
మీరు ఎవరితో అయినా ప్రేమలో ఉన్నపుడు వారితో సమయం గడుపుతూ కూడా సంతోషంగా ఉండొచ్చు. దానికి పెళ్లి చేసుకోవాల్సి అవసరం లేదు.... అని తాప్సి అభిప్రాయ పడ్డారు.


Click it and Unblock the Notifications











