twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లికి ముందే అలాంటి సంబంధమా? ఇంట్లో ఒప్పుకోరంటున్న హీరోయిన్!

    |

    మహేష్ బాబు '1-నేనొక్కడినే' సినిమా ద్వారా హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఢిల్లీ బ్యూటీ క్రితి సానన్... తెలుగు ఇండస్ట్రీలో కలిసి రాకపోవడంతో బాలీవుడ్లోనే తన కెరీర్ బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం క్రితి నటిస్తున్న 'లుకా చుప్పి' అనే హిందీ చిత్రం మార్చిన 1న విడుదలకు సిద్ధమవుతోంది.

    కార్తీక్ ఆర్యన్, క్రితి సానన్ జంటగా నటిస్తున్న 'లుకా చుప్పి' కథ లివ్ ఇన్ రిలేషన్ షిప్(సహజీవనం) చుట్టూ నడుస్తుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న క్రితి... సహజీవనంపై తన వ్యక్తిగత అభిప్రాయం వెల్లడించారు.

    మా ఇంట్లో ఒప్పుకోరు...

    మా ఇంట్లో ఒప్పుకోరు...

    పెళ్లి చేసుకోకుండా సహ జీవనం చేస్తున్న వారిని నేను జడ్జ్ చేయలేను. నాకు సంబంధించిన వరకు నా కుటుంబం నుంచి ఇలాంటి వాటికి నైతిక మద్దతు లభించదు. అందుకే నేను అలాంటి సంబంధాలు ఎంచుకోను అని క్రితి సానన్ స్పష్టం చేశారు.

    ఆరేంజ్డ్ మ్యారేజ్‌కు అంగీకరించను

    ఆరేంజ్డ్ మ్యారేజ్‌కు అంగీకరించను

    పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ కూడా తాను ఎంచుకోనని.. ఈ విషయం తన కుటుంబ సభ్యులకు ముందే చెప్పినట్లు క్రితి తెలిపారు. మనం పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో జీవితం మొత్తం కలిసి ఉండాలి, అతడు మనకు తెలిసిన వ్యక్తి అయి ఉండాలి అని ఆమె అన్నారు.

    ఆ హీరోతో సంబంధంపై...

    ఆ హీరోతో సంబంధంపై...

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో ఎఫైర్ ఉందనే రూమర్లపై క్రితి రియాక్ట్ అయ్యారు. మా ఇద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉంది, 2016 నుంచి తమపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని పట్టించుకోను అన్నారు.

    క్రితి సానన్

    క్రితి సానన్

    క్రితి సానన్ నటిస్తున్న ‘లుకా చుప్పి'మార్చిన 1న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు అర్జున్ పాటియాలా, హౌస్ ఫుల్ 4, పానిపట్ చిత్రాల్లో నటిస్తున్నారు.

    English summary
    "I don't judge people who are in live-in relationships, but the kind of family I come from, it's not morally acceptable so I wouldn't opt for it. At the same time, I've told my parents that I would also never agree to an arranged marriage. It's very important for me to know the person I'm going to spend the rest of my life with." Kriti Sanon said about live-in relationships.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X