Year Ender 2023: కుర్రాళ్ల మనసు దోచిన టాప్ 5 కన్నడ హీరోయిన్లు వీళ్లే.. మొదటి స్థానంలో రష్మిక మందన్నా, ఆ తర్వాత
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రతీ వారం, ప్రతీ ఏడాది అనేక విషయాల గురించి సర్వేలు నిర్వహిస్తుంది. అనేక విషయాలను వెలుగులోకి తీసుకు వస్తుంది. అయితే తాజాగా ఈ సంస్థ దేశం మెచ్చిన కన్నడ హీరోయిన్లు లిస్టును విడుదల చేసింది. ముఖ్యంగా కన్నడ టాప్ 5హీరోయిన్లు లిస్టును రిలీజ్ చేసి అందరినీ మెస్మరైజ్ చేసింది. అయితే ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. రష్మిక మందన్నా:నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2016లో కిరిక్ పార్టీ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ నటిస్తూ అందరినీ అలరిస్తోంది.

2. రచితా రామ్:రచితా రామ్ అసలు పేరు బింధియా రామ్. అయితే సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె తన పేరును రచితా రామ్ గా మార్చుకుంది. 2010 నుంచి ఇప్పటి వరకు టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. బుల్బుల్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో కాలు మోహిన ఈమె కూడా అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. తన అందం అభినయంతో అందరినీ అలరిస్తోంది.
3. రాధికా పండిట్:రాధికా పండిట్ 2008లో మొగ్గిన మనసు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే కర్ణాటక రాష్ట్ర సినీ అవార్డుతో పాటు ఫింఫరే అవార్డును అందుకుంది. తన అందం, అభినయంతో అందరి మనసులు గెలుచుకున్న ఈమెకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.

4. రమ్య:2003లో కన్నడలో విడుదలైన 'అభి' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టిందీ రమ్య. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది. రమ్య 2013లో మాండ్య నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎంపీగా ఎన్నికైంది. రమ్య స్క్రీన్ నేమ్ కాగా ఆమె అసలు పేరు దివ్య స్పందన.

5. శ్రీనిధి శెచ్చి:కేజీఎఫ్ సినిమాతో కన్నడ సినీ రంగంలో అడుగు పెట్టిన శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో ఫుల్ గా అలరించే ఈ ముద్దుగుమ్మకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల్లో చేసిన ఈమె కోబ్రా సినిమాలోనూ నటించి మెప్పించింది.


Click it and Unblock the Notifications











