Rakshitha: గుర్తుపట్టని విధంగా మారిపోయిన ఇడియట్, ఆంధ్రావాలా హీరోయిన్.. అప్పట్లో పూరితోనే ఎక్కువగా..

సినిమా ప్రపంచంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ఎంతగానో గుర్తింపు అందుకున్న వారు కాస్త గ్యాప్ ఇచ్చిన కూడా ఊహించని లుక్కుల్లోకి మారిపోతూ ఉంటారు. ఇక అదే తరహాలో ఇప్పుడు ఒక హీరోయిన్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. గతంలో రవితేజతో ఇడియట్ అనే సినిమా చేసి మంచి గుర్తింపును అందుకున్న హీరోయిన్ రక్షిత పూరి జగన్నాథ్ తో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. ఇక ఇప్పుడు ఏం చేస్తుంది ఏ విధంగా మారిపోయింది అనే వివరాల్లోకి వెళితే..

 ఇడియట్ సినిమాతో

ఇడియట్ సినిమాతో

హీరోయిన్ రక్షిత అనగానే అందరికీ ఎక్కువగా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేసిన ఇడియట్ అనే సినిమా గుర్తుకు వస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ చేసిన ఇడియట్ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్పెషల్ బజ్ అయితే క్రియేట్ చేసింది. అలాంటి సినిమా అప్పటివరకు రాకపోవడంతో జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. అలాంటి సినిమా ద్వారా రక్షిత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది

రెండు రాష్ట్రాల్లో..

రెండు రాష్ట్రాల్లో..

అసలైతే ఇడియట్ సినిమా మొదట కన్నడ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే అప్పు అనే టైటిల్ తో వచ్చింది. ఆ సినిమాతోనే కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ స్టార్ హీరోగా క్రేజ్ అందుకున్నాడు. ఇక అదే సినిమాతో రక్షిత హీరోయిన్ గా పరిచయమైంది. ఆమెకు మొదటి సినిమా కూడా అదే. రెండు రాష్ట్రాల్లో కూడా ఆమెకు అప్పట్లో పూరి ఇడియట్ సినిమాతోనే మంచి గుర్తింపు అయితే దక్కింది.

అప్పట్లో చాలా బిజీగా

అప్పట్లో చాలా బిజీగా

కర్ణాటక కు చెందిన ఈ బ్యూటీ మొదట మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. ఇక రక్షిత 2002లో కెరీర్ ను స్టార్ట్ చేసి 2006 వరకు కూడా ఆమె ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయింది. తెలుగు కన్నడ తమిళ్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది.

మొదట్లో ఎక్కువగా పూరితోనే..

మొదట్లో ఎక్కువగా పూరితోనే..

అయితే రక్షిత మాత్రం ఎక్కువగా పూరి జగన్నాథ్ సినిమాలతోనే తెలుగులో కనిపించేది. ఇడియట్ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత ఆంధ్రావాలా సినిమాలో కూడా కనిపించిన రక్షిత పూరీ నాగార్జునతో చేసిన శివమణి సినిమాలో కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించే ప్రయత్నం చేసింది.

గుర్తుపట్టని విధంగా..

గుర్తుపట్టని విధంగా..

అయితే హీరోయిన్ గా రిటర్మెంట్ ఇచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అయితే ఎక్కువగా కనిపించలేదు. ఇక ఆమెను సడన్ గా చూసిన తెలుగువారు అయితే ఆశ్చర్యపోతున్నారు. రక్షిత ఇప్పుడు చాలా లావుగా మారిపోయింది. అయినప్పటికీ అదే ఎనర్జీతో కనిపిస్తున్నట్లుగా ఆమె ఫోటోలను చూస్తూనే అర్థమవుతోంది.

ఇప్పుడు ఏం చేస్తోందంటే..

ఇప్పుడు ఏం చేస్తోందంటే..


ఇక తెలుగులో అయితే బ్యూటీ చివరగా 2005లో జగపతి అనే సినిమా చేసింది. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోనే 2007 వరకు హీరోయిన్ గా కనిపించిన ఈ బ్యూటీ ప్రేమ్ అనే కన్నడ దర్శకుడుని పెళ్లి చేసుకుని హీరోయిన్ గా అయితే సినిమాలను తగ్గించేసిందే. ఇక ఆ తర్వాత ఎక్కువగా నిర్మాతగా తన అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటుంది. ఇప్పటికే ఆమె ప్రొడక్షన్లో మూడు కన్నడ సినిమాలు వచ్చాయి. మరి తెలుగులో ఆమె ఎలాంటి రీఎంట్రీ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X