ఎవడితో అయినా సంవత్సరమే, నో పెళ్లి... నర్మగర్భంగా మాట్లాడిన శ్రీరెడ్డి!

ఆమె గుడ్డలు విప్పేసి రోడ్డెక్కిన సమయంలో బరితెగించింది, ఇండస్ట్రీ పరువు తీసిందని చాలా మంది విమర్శించారు. అయితే ఆమె అలా చేసింది కాబట్టే 'కాస్టింగ్ కౌచ్' అంశంపై మీడియాలో తీవ్రమైన చర్చసాగింది అనేది కాదనలేని నిజం. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యపై ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఆ పరిణామాలే 'క్యాష్' కమిటీ లాంటివి ఏర్పాటు కావడానికి దోహదం చేశాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

నా తల్లిదండ్రులను తప్ప...

నా తల్లిదండ్రులను తప్ప...

శ్రీరెడ్డి తాజాగా తన ఫేస్ బుక్ పోస్టులో పెళ్లి గురించి, రిలేషన్ షిప్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను నా తల్లిదండ్రులను తప్ప ఎవరినీ ప్రేమించలేను అంటూ తన మనసులోని విషయాన్ని నర్మగర్బంగా బయట పెట్టారు. ఈ విషయంలో ఎప్పటికీ మార్పు ఉండదని తెలిపారు.

ఎవడైనా సంవత్సరమే, తర్వాత బోర్ కొడతాడు... నేను ప్లే గర్ల్

ఎవడైనా సంవత్సరమే, తర్వాత బోర్ కొడతాడు... నేను ప్లే గర్ల్

నేను ఎవరైనా వ్యక్తిని ఇష్టపడితే.. అతడితో కేవలం సంవత్సరం మాత్రమే డేటింగ్ చేయగలను. కొన్ని రోజుల తర్వాత అతడు బోర్ కొడతాడు. ఆ తర్వాత నాకు కొత్త ప్రేమ కావాలని అనిపిస్తుంది అంటూ పచ్చిగా మాట్లాడిన శ్రీరెడ్డి... తాను ప్లే‌గర్ల్ అంటూ నిర్మొహమాటంగా వెల్లడించారు.

అందుకే పెళ్లి చేసుకోవడం లేదు

అందుకే పెళ్లి చేసుకోవడం లేదు

నా మైండ్ సెట్ ప్రకారం పెళ్లి అనేది నాకు సూటవ్వదు. అందుకే వివాహానికి దూరంగా ఉంటున్నాను. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇలాగే నాకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటున్నట్లు శ్రీరెడ్డి వెల్లడించారు. శ్రీరెడ్డి చేసిన ఈ పోస్టుపై వందల సంఖ్యలో అభిమానులు స్పందించారు. చాలా మంది ఆమె నిర్ణయాన్ని సమర్ధించడం గమనార్హం.

చెన్నైలో సెటిలైన శ్రీరెడ్డి

చెన్నైలో సెటిలైన శ్రీరెడ్డి

తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై పోరాటం చేసి పలువురు సినీ ప్రముఖుల కామ భాగోతాలు బయటపెట్టిన శ్రీరెడ్డి సంచలనం క్రియేట్ చేసింది. అయితే ఇండస్ట్రీ పెద్దల నుంచి మద్దతే లేక పోవడంతో చివరకు ఇది ఆమె తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోయే పరిస్థితికి దారి తీసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో సెటిలై తమిళంలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X