Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరోసారి బికినీతో ఇలియానా.. ఈ సారి ఇంకొంచెం హాట్‌గా.. మామూలుగా లేదు.!
స్టార్ హీరోయిన్ ఇలియానా.. ఈ పేరు తెలియని తెలుగు వాళ్లు ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో మెరిసి టాప్ హీరోయిన్గా ఎదిగిందీ ఈ గోవా బ్యూటీ. ఇక్కడ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది. టాలీవుడ్‌లోని ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే, అదే సమయంలో దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వాలన్న భావనతో టాలీవుడ్‌కు బాయ్ చెప్పేసింది.
హిందీలో ఆమె నటించిన 'బర్ఫీ' మినహా మిగిలిన సినిమాలేవీ అంతగా ఆడకపోవడంతో గోవా బ్యూటీ పని అయిపోయింది. ఇలియానా నటించిన చిత్రాలన్నీ వరసగా వైఫల్యాలు చెందడంతో అటు బాలీవుడ్‌లోను ఇటు టాలీవుడ్‌లోను అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. అలాంటి సమయంలో కోలీవుడ్‌లో శంకర్ దర్శకత్వంలో 'త్రీఇడియట్స్' హిందీ రీమేక్ 'నన్బన్'లో విజయ్ సరసన నటించింది. ఆ చిత్రం ఘనవిజయం సాధించినా ఎందుకనో ఇలియానాకు అవకాశాలు రాలేదు.
ఇక, చాలా రోజుల తర్వాత తెలుగులో రవితేజ సరసన నటించింది ఈ అమ్మడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా ఇలియానా టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించకపోవడంతో ఆమెకు నిరాశ తప్పలేదు. ఆ సినిమా తర్వాత ఇల్లీ బేబీ మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో ఓ సినిమా చేస్తోంది.
View this post on InstagramWhen the beach calls 🏝 📸 @colstonjulian
A post shared by Ileana D'Cruz (@ileana_official) on
ఇలియానా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ బికినీలో ఉన్న ఓ పిక్‌ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉంచింది. దీనికి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఒకేరోజులో ఈ ఫొటోను ఆరున్నర లక్షల మంది లైక్ చేయడం విశేషం. సినిమాల్లో నటించకున్నా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు.