బికినీతో ఇలియానా.. ఏమాత్రం తగ్గలేదు.. ఎంత బీభత్సంగా ఉందో చూస్తే అవాక్కవుతారు
ఇలియానా.. ఈ పేరు తెలుగు వాళ్లకు బాగా పరిచయమే. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో మెరిసి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది ఈ గోవా బ్యూటీ. ఇక్కడ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. అయితే, అదే సమయంలో దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వాలన్న భావనతో టాలీవుడ్‌కు బాయ్ చెప్పేసింది.
బాలీవుడ్ ఆమె నటించిన 'బర్ఫీ' మినహా మిగిలిన సినిమాలేవీ అంతగా ఆడకపోవడంతో గోవా బ్యూటీ పని అయిపోయింది. ఇలియానా నటించిన చిత్రాలన్నీ వరసగా వైఫల్యాలు చెందడంతో అటు బాలీవుడ్‌లోను ఇటు టాలీవుడ్‌లోను అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. అలాంటి సమయంలో కోలీవుడ్‌లో శంకర్ దర్శకత్వంలో 'త్రీఇడియట్స్' హిందీ రీమేక్ 'నన్బన్'లో విజయ్ సరసన నటించింది. ఆ చిత్రం ఘనవిజయం సాధించినా ఎందుకనో ఇలియానాకు అవకాశాలు రాలేదు.

ఇక, చాలా రోజుల తర్వాత తెలుగులో రవితేజ సరసన నటించింది ఈ అమ్మడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా ఇలియానా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించకపోవడంతో ఆమెకు నిరాశ తప్పలేదు. ఆ సినిమా తర్వాత ఇల్లీ బేబీ మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తోంది.
ఇక, వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఇలియానా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా వైట్ బికినీలో ఉన్న ఓ పిక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఉంచింది. దీనికి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఒకేరోజులో ఈ ఫొటోను పది లక్షల మంది లైక్ చేయడం విశేషం. సినిమాల్లో నటించకున్నా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











