అలాంటి పాత్రలు నాకు ఛాలెంజ్.. క్రేజీ రోల్‌తో ఇలియానా
తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన, గ్లామర్ పాత్రలు పోషించిన ఇలియానా డి క్రజ్ మరోసారి ఓ విభిన్నమైన పాత్రతో ముందుకొచ్చారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నిర్మాతగా అభిషేక్ బచ్చన్‌తో ఆమె నటించిన ది బిగ్ బుల్ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్నది. ఈ చిత్రం ఓటీటీ ద్వారాప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతున్న సమయంలో ఇలియానా మాట్లాడుతూ..
ఇప్పటి వరకు ఎన్నో పాత్రలను పోషించాను. ఏ పాత్రనైనా ఓ ఛాలెంజింగ్‌గా తీసుకొంటాను. దానిని నిబద్ధతగా, కాన్ఫిడెన్స్‌తో చేస్తాను. అలా చేయకపోతే ఆ పాత్రకు న్యాయం చేసినట్టు కనిపించదుఅ ని ఓ ప్రశ్నకు ఇలియానా సమాధానం చెప్పారు.

ది బిగ్‌బుల్ మూవీలో నా పాత్ర కీలకమైనది. నా పాత్ర ద్వారానే కథ తన ప్రయాణాన్ని సాగిస్తుంది. మూవీ నేరేషన్‌లో నేను కీలకంగా కనిపిస్తాను. ఈ సినిమాలో నేను భిన్నంగా కనిపిస్తాను. ఆ పాత్ర కోసం చాలా వర్కువుట్ చేశాను అని ఇలియానా పేర్కొన్నారు.
ది బిగ్ బుల్ తర్వాత అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ అనే కాన్సెప్ట్ బెస్డ్ చిత్రంలో ఇలియానా నటిస్తున్నారు. నలుపు రంగులో ఉన్న యువతి.. తెల్లగా కనిపించాలని తపించే పాత్రలో ఇలియానా నటించనున్నారు. హర్యానా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్నది. రణదీప్ హుడాతో కలిసి ఇలియానా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











