ఇలియానా బికినీ ట్రీట్.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు.. అదొక్కటే ఉందా? అంటూ అసభ్యంగా!
ఇలియానా ప్రస్తుతం కాస్త ఖాళీగా ఉంది. సినిమా అవకాశాలు తక్కువగా ఉండటంతో అమ్మడు తన ఖాళీ సమయాన్ని వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ మధ్య బాలీవుడ్ భామలు అందరూ క్యూ కడుతున్న మాల్దీవుల్లో ఆమె సేదతీరుతోంది. అక్కడ తన అందాలను ఆరబోస్తోన్న ఆమె ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. అయితే ఆమె వరుసగా బికినీ ఫోటోలు షేర్ చేస్తూ ఉండడంతో ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
Recommended Video

మాల్దీవుల్లో
వైట్ బికినీలో తన అందాలను మాల్దీవుల్లో ఆరబోస్తోంది ఇలియానా. అంతేకాకుండా అమ్మడి సెక్సీ లుక్స్‌తో నెటిజన్స్‌ను కట్టిపడేస్తోంది. అయితే ఈ ఫొటోలతో సినిమా అవకాశాలు కొట్టేద్దామనా, లేకుంటే ఫేమస్ టూరిజం స్పాట్‌ను ప్రమోట్ చేయాలనా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఇలియానా తన హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ఒక విషయంలో నెటిజనులకు దొరికేసింది.

వైరల్
నటి ఇలియానా డిక్రూజ్ తన బికినీ చిత్రాల కోసం తీవ్రంగా ట్రోల్ చేయబడుతోంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ ఆమె బోల్డ్ బికినీ ఫోటోలను షేర్ చేస్తున్న క్రమంలో ఆమెను తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు మరియు చాలా మంది ఫాలోవర్స్ ఆమెకు అదే బికినీ ఉందా అని కూడా అడుగుతున్నారు. చాలా రోజులుగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన చిత్రాలలో, తెల్లటి బికినీలో కనిపిస్తోంది. ఆమె యొక్క ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మరో బికినీ లేదా?
ఇలియానా చిత్రాలను ఆమె వేలాది మంది అభిమానులు ఇష్టపడగా, సోషల్ మీడియా ఫాలోవర్స్ లో ఒక వర్గం ఆమె చిత్రాలలో కొంచెం ఎక్కువగా 'ఎక్స్‌పోజ్' చేసిందని భావించారు. అందుకే కొంత మంది ఆమె ఎద భాగం గురించి అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఏమో ఆమెకు ఆ బికినీ తప్ప మరో బికినీ లేదా? అని ప్రశ్నించారు.

ముంబై తిరిగి వచ్చేసి కూడా
నిజానికి ఆమె అక్కడి నుంచి ముంబై తిరిగి వచ్చేసింది కూడా. అయినా ఆమె అక్కడి వెకేషన్ ను మరచిపోలేక పాత ఫోటోలను షేర్ చేస్తోంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాట్ అండ్ బోల్డ్ ఫోటోలు మరియు వీడియోలను పంచుకుంటుంది. అయితే, ఇలియానా డిక్రూజ్ బోల్డ్ చిత్రాలను పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆమె తరచుగా బికినీ చిత్రాలను పంచుకుంటుంది.

సినిమాల విషయానికి వస్తే
ఇక ఇలియానా సినిమాల విషయానికి వస్తే.. ఆమె ది బిగ్ బుల్' అనే సినిమాలో నటించింది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అయ్యి ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తర్వాత సినిమా రణదీప్ హుడా సరసన అన్ 'ఫెయిర్ అండ్ లవ్లీ' అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఇక ఇది ఇలా ఉండగా ఇలియానా మరో షాకింగ్ రోల్ లో నటిస్తున్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. తన కెరీర్ లో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు పోషించని వేశ్య పాత్రలో ఇలియానా నటిస్తుందని సమాచారం.


Click it and Unblock the Notifications











