twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఫైర్ల మీదే అందరికీ ఆసక్తి.. అలాంటి ప్రశ్నలపై చిర్రెత్తిన ఇలియానా

    |

    గోవా సుందరి ఇలియానా తెలుగు ప్రేక్షకులను తొలి చూపులోనే కట్టిపడేసింది. దేవదాస్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఇలియానా.. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. టాలీవుడ్‌లో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్‌గా ఇలియానా రికార్డులకెక్కిందని అప్పట్లో టాక్ వినిపించింది. అంతటి స్టార్డమ్ సంపాదించుకున్న ఇలియానా.. బాలీవుడ్ బాట పట్టింది.

    అయితే అక్కడ అనుకున్నంతగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఆపై ప్రియుడితో చెట్టాపట్టాలు, సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో నానా రచ్చ చేసింది. తాజాగా ఇలియానాకు బాగానే కోపం వచ్చినట్టు కనిపిస్తోంది. ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.

     టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

    మొదటి చిత్రం దేవదాస్‌తోనే మంచి హిట్ కొట్టిన ఇలియానాకు.. రెండో సినిమా పోకిరితో భారీ హిట్టు కొట్టింది. రెండో మూవీతోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ రేంజ్ క్రేజ్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాతో ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఇక్కడ పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్‌కు చెక్కేసింది.

    బాలీవుడ్‌లో ఫెయిల్..

    బాలీవుడ్‌లో ఫెయిల్..

    బాలీవుడ్‌లో ఇలియానా చేసిన చిత్రాలన్నీ బోల్తా కొట్టాయి. అయితే నటన పరంగా మంచి పేరునే తెచ్చిపెట్టినా.. కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. అందుకే ఇలియానా మళ్లీ టాలీవుడ్ వైపు ఆశగా చూసింది. అయితే ఇక్కడ మళ్లీ మునుపటి వైభవం దక్కలేదు.

    ప్రియుడితో బ్రేకప్..

    ప్రియుడితో బ్రేకప్..

    ఇలియానా ఆస్ట్రేలియా ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో ఓ రేంజ్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ప్రియుడు కెమెరాతో తన అందాలను బంధిస్తుంటే.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేది. అయితే ప్రియుడితో గతేడాది బ్రేకప్ అయిన ఇలియానా.. అతడి జ్ఞాపకాలను తుడిచేసింది. అతని ఫోటోలన్నీ డిలీట్ చేసింది.

    అఫైర్లపై ప్రశ్నలు..

    అఫైర్లపై ప్రశ్నలు..

    తాజాగా ఇలియానా నెటిజన్లతో ముచ్చటించింది. మీరు ఇప్పుడు సింగిల్ గానే ఉన్నారా? లేక ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉన్నారా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఇలియానాకు చిర్రెత్తిపోయింది. పిల్లి ఫోటోను తన ఫోటోతో మిక్స్ చేస్తూ.. ‘ఇతరుల అఫైర్ల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మనకు చాలా ఎక్కువగా ఉంటుంది కదా?' అని వ్యాఖ్యానించింది.

    English summary
    Ileana D'cruz Fires On Netizens After Asking About Affairs. 'Are you single or in a relationship?, replying to which Ileana posted a picture of her covering the lower half of her face with an image of a cat showing off his teeth, with a text written below as, 'Well aren’t we nosey?' Well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X