For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రెచ్చిపోయిన ఇలియానా: బీచ్‌లో అలా కనిపించి షాకిచ్చిన బ్యూటీ.. బేబీ స్టెప్‌కు సమయం వచ్చిందంటూ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. వారిలో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును అందుకుని.. స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు. అందులో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో మెరిసి టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామ.. బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వాలన్న భావనతో టాలీవుడ్‌కు బాయ్ చెప్పేసింది. అక్కడ ఆమెకు నిరాశే ఎదరవడంతో సినిమాలకు దూరమైపోయింది. ప్రస్తుతానికి ఖాళీగానే ఉంటోన్న ఇలియానా.. తాజాగా హాట్ షోతో సెగలు రేపుతూ రచ్చ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  తెలుగులోనే పరిచయం.. అప్పుడు దూరం

  తెలుగులోనే పరిచయం.. అప్పుడు దూరం

  ‘దేవదాసు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఇలియానా. మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితోనూ నటించింది. అయితే, వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న సమయంలో టాలీవుడ్‌కు దూరమైంది.

  రీఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. హిందీలోనూ స్టాప్

  రీఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. హిందీలోనూ స్టాప్

  తెలుగు సినిమాలకు దూరమైన ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. అక్కడ రెండు మూడు సినిమాలు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. దీంతో అక్కడ కూడా సినిమాల వేగం తగ్గించింది. ఈ నేపథ్యంలోనే ‘అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా ఇలియానా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అదీ నిరాశ పరచడంతో ఆ సినిమా తర్వాత ఇల్లీ బేబీ మళ్లీ కనిపించలేదు.

  ప్రియుడితో రచ్చ రచ్చ... డిప్రెషన్‌తో బ్రేకప్

  ప్రియుడితో రచ్చ రచ్చ... డిప్రెషన్‌తో బ్రేకప్

  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. దీంతో అప్పటి నుంచి ఆమె కెరీర్ గాడి తప్పింది. ఇద్దరూ కలిసి గోవాలో ఓ ఇంటిలో ఉండడం.. ఎక్కడకు వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని కనిపించడం వంటి వాటితో ఆమె తరచూ వార్తల్లో నిలిచేది. కొన్నేళ్ల తర్వాత తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిందీ బ్యూటీ.

  సినిమా ఛాన్స్‌ల కోసం కసరత్తులు చేస్తూ

  సినిమా ఛాన్స్‌ల కోసం కసరత్తులు చేస్తూ

  ప్రియుడితో విడిపోయిన సమయంలో డిప్రెషన్‌కు గురైంది ఇలియానా. దీంతో ఈ అమ్మడు బాగా లావైపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక, బరువు తగ్గేందుకు ఇటీవలి కాలంలో జిమ్‌లో కసరత్తులు చేస్తూ బిజీ బిజీగా గడిపింది. దీంతో మునుపటి రూపానికి వచ్చింది. ఇల్లి బేబీ ఇంతగా కష్ట పడింది సినిమా ఛాన్స్‌ల కోసమే అని అంటున్నారు.

  అక్కడ ఫుల్ బిజీగా... అన్నీ దాని నుంచే

  అక్కడ ఫుల్ బిజీగా... అన్నీ దాని నుంచే


  సినిమాల్లో కనిపించకపోయినప్పటికీ ఇలియానాకు తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. అంటే ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌ అన్నమాట. తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోలకు బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. ఆమె ఫొటోలకు భారీ స్థాయిలో లైక్స్ కూడా వస్తుంటాయి.

  బీచ్‌లో అలా కనిపించి షాకిచ్చిన బ్యూటీ

  బీచ్‌లో అలా కనిపించి షాకిచ్చిన బ్యూటీ


  సోషల్ మీడియా ద్వారా ఇలియానా తరచూ అందాల విందు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బీచ్‌లో బికినీతో ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. దానికి ‘ఇన్ని రోజుల్లో నా గురించి నాకేం తెలియలేదు. నా ప్రయాణం బేబీ అడుగుల్లా ముందుకు సాగుతోంది' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఇలియానా బికినీ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

  English summary
  Ileana D'Cruz is an Indian actress and model who predominantly appears in Telugu and Hindi language films. D'Cruz was born in Mumbai to a lawyer Ronaldo D'Cruz and Sameera and spent most of her childhood in Goa. Though initially reluctant, D'Cruz made her screen debut in 2006 with Telugu-language film Devadasu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X