బట్టలు లేకుండా ఇలియానా ఫోజులు: అదొక్కటే అడ్డుగా పెట్టి.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!
ఇలియానా.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. పర్‌ఫెక్ట్ ఫిగర్ మాత్రమే కాదు.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది. ఆ తర్వాత ఇతర పరిశ్రమల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఈ అమ్మడు తన మార్కును చూపిస్తూ వచ్చింది. అయితే, కొంత కాలంగా ఇలియానా వెండితెరపై సరిగా సందడి చేయడం లేదు. కానీ, ఆ లోటును సోషల్ మీడియా ద్వారా తీర్చుతోంది. ఈ క్రమంలోనే అందాల విందు కూడా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ హాట్ ఫొటోను వదిలింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

ఇలియానా కెరీర్ అలా మొదలైంది
మోడలింగ్ చేస్తున్నప్పుడే 'దేవదాసు' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఆరంభంలోనే అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే దాదాపు తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితోనూ నటించింది. తద్వారా స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లింది. అలాగే రెమ్యూనరేషన్‌తో రికార్డు క్రియేట్ చేసేసింది.

స్టార్ హీరోయిన్.. వరుసగా షాక్‌లతో
సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో తన మార్కు చూపించిన ఇలియానా.. కొన్నాళ్లు వరుస ఫ్లాపులు ఎదురవడంతో ఇక్కడ సినిమాలు తగ్గించేసింది. అదే సమయంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ అవకాశాల మీద అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే గ్యాప్ తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేకపోయింది.

కెరీర్‌తో పాటు లవ్ ట్రాకు సక్సెస్‌గా
కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. దీంతో అప్పటి నుంచి ఆమె కెరీర్ గాడి తప్పింది. ఇద్దరూ కలిసి గోవాలో ఓ ఇంటిలో ఉండడం.. ఎక్కడకు వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని కనిపించడం వంటి వాటితో ఆమె తరచూ వార్తల్లో నిలిచేది. కొన్నాళ్లకు అతడితో బంధానికి బ్రేకప్ చెప్పేసిందీ బ్యూటీ.

ఇబ్బంది పెట్టిన బ్రేకప్... సూసైడ్
ప్రియుడితో విడిపోయిన తర్వాత ఇలియానా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అప్పుడు ఆమె కెరీర్ పరంగా గాడి తప్పడంతో పాటు ఫిజిక్‌ను కూడా పోగొట్టుకుంది. అదే సమయంలో ఈమె ఆత్మహత్యకు యత్నించినట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఇక, ఇది జరిగిన తర్వాత కొన్నేళ్లకు తేరుకున్న ఈ భామ.. ఆఫర్ల కోసం చూస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని బాలీవుడ్ చిత్రాలు చేసింది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ
కొంత కాలంగా సినిమాలు చేయకున్నా సోషల్ మీడియా ద్వారా ఇలియానా తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫలితంగా తన అందాలతో ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేసేస్తుంది.

ఎక్కువగా అలా చూపిస్తోన్న భామ
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ఇలియానా ఈ మధ్య అందాల విందు చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. వీటిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది.
Recommended Video

బట్టల్లేకుండా దిగిన ఫొటోలో ఇలా
తాజాగా ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బట్టలు లేనట్లుగా కనిపించింది. అంతేకాదు, ఓ టోపీ అడ్డుగా పెట్టుకుని అందాలను కనిపించకుండా కవర్ చేసుకుంది. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











