బాడీలోని ఆ పార్టు చూపించిన ఇలియానా: హాట్ సెల్ఫీ వీడియోతో రచ్చ.. ఏకంగా దగ్గరకు పెట్టి షాకిచ్చింది
ఆకట్టుకునే అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో దాదాపు దశాబ్ధ కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపించింది గోవా బ్యూటీ ఇలియానా. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను అందుకుంది. అదే సమయంలో వరుస ఆఫర్లతో సత్తా చాటింది. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్‌ను వీడిన ఈ భామ.. వేరే ఇండస్ట్రీలపై ఫోకస్ చేసింది. అదే సమయంలో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హాట్ సెల్ఫీ వీడియోతో తన అందాలను చూపించి షాకిచ్చింది. ఆ వివరాలు మీకోసం!

అలా మొదలైన కెరీర్.. టాలీవుడ్‌కు గుడ్‌బై
రామ్ పోతినేని హీరోగా పరిచయం అయిన 'దేవదాసు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితోనూ నటించింది. అయితే, వరుస ఫ్లాపుల వల్ల టాలీవుడ్‌కు దూరమైంది.

గ్యాప్ తర్వాత రీఎంట్రీ.. మాయమైపోయింది
తెలుగు సినీ పరిశ్రమకు దూరమైన తర్వాత ఇలియానా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత హిందీలో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే 'అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా ఇలియానా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అదీ నిరాశ పరచడంతో ఆ సినిమా తర్వాత ఇల్లీ బేబీ మళ్లీ మాయమైపోయింది.

ఆస్ట్రేలియన్‌తో లవ్.. చివరికలా ముగిసిందిగా
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. దీంతో అప్పటి నుంచి ఆమె కెరీర్ గాడి తప్పింది. ఇద్దరూ కలిసి గోవాలో ఓ ఇంటిలో ఉండడం.. ఎక్కడకు వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని కనిపించడం వంటి వాటితో ఆమె తరచూ వార్తల్లో నిలిచేది. కొన్నేళ్ల తర్వాత తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిందీ బ్యూటీ.

డిప్రెషన్‌లోకి బ్యూటీ... ఛాన్స్‌ల కోసమే అలా
లవర్‌తో బ్రేకప్ అయిన సమయంలో డిప్రెషన్‌కు గురైంది ఇలియానా. దీంతో మెడిసిన్ వాడకం ఎక్కువై ఈ అమ్మడు బాగా లావైపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక, బరువు తగ్గేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తూ బిజీగా గడిపింది. దీంతో మునుపటి రూపానికి వచ్చింది. ఇల్లి బేబీ ఇంతగా కష్ట పడింది సినిమా ఛాన్స్‌ల కోసమే అని అంటున్నారు.

ఎప్పుడూ అందులోనే.. హాట్ షో రచ్చ చేస్తూ
సినిమాల్లో కనిపించకపోయినప్పటికీ ఇలియానాకు తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. అంటే ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ అన్నమాట. తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోలకు బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. ఆమె ఫొటోలకు భారీ స్థాయిలో లైక్స్ కూడా వస్తుంటాయి.

బాడీలోని ఆ పార్టు చూపించిన ఇలియానా
తాజాగా ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీ వీడియోను స్టోరీగా షేర్ చేసింది. ఇందులో ఆమె తన ఎద అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది. కెమెరాను ఆ భాగానికి దగ్గరగా తీసుకొచ్చి మరీ చూపించింది. తద్వారా కుర్రకారు హృదయాలకు గాయాలు చేస్తోంది. దీంతో ఈ వీడియోకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











