Don't Miss!
- News
నాలుగు కీలక నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధుల ఖరారు..!?
- Finance
UPI: రికార్డు స్థాయిలో UPI వినియోగం.. మొత్తం లావాదేవీల్లో UPI వాటా ఎంతంటే..
- Sports
Team India : టీమిండియా పేసర్లు టార్గెట్‌గా ట్రోలింగ్.. వీడియో వైరల్!
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Ileana D'Cruz: ఆ స్టార్ హీరోయిన్ సోదరుడితో డేటింగ్.. పోకిరి భామ అస్సలు తగ్గట్లేదుగా!
పోకిరి సినిమాతో అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అందుకున్న గోవా బ్యూటీ ఇలియానా డి క్రజ్ ఏ రేంజ్ లో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదట్లో ఈ బ్యూటీ సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంది. ఇక ఇలియానా కొన్నాళ్ళకు బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ బాగానే అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలో ఆమె లవ్ స్టోరీస్ కి సంబంధించిన వార్తలు చాలానే వచ్చాయి. రీసెంట్ గా ఆమె మళ్ళీ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. అది కూడా ఒక స్టార్ హీరోయిన్ బ్రదర్ తోనే డేటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

మొదటి ప్రేమ
ఇలియానా గతంలో ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో గాఢమైన రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. చాలా కాలం పాటు ప్రేమలో మునిగిగితేలిన వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని టాక్ అయితే వచ్చింది. రెగ్యులర్ గా ఇలియానా ప్రియుడి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే, తెలియని కారణాల వల్ల వారి సంబంధం తెగిపోయింది.

మరోసారి ప్రేమలో
ఇక ఆ బ్రేకప్ అనంతరం ఇలియానా చాలా రోజుల వరకు డిప్రెషన్ లోనే ఉన్నట్లు టాక్ వచ్చింది. కొత్త ఆఫర్స్ వచ్చినా కూడా అప్పట్లో ఆమె సినిమాలు చేయడానికి కూడా ఆసక్తి చూపలేదట. ఇక రీసెంట్ గా ఇలియానా మరోసారి ప్రేమలో పడ్డట్లు డేటింగ్ లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి.

కత్రినా కైఫ్ సోదరుడు
ఇక
ఆమె
లవ్
చేసింది
మరెవరినో
కాదు.
బాలీవుడ్
స్టార్
హీరోయిన్
కత్రినా
కైఫ్
సోదరుడు
సెబాస్టియన్
లారెంట్
మిచెల్
తోనే
ఇలియానా
డేటింగ్
లో
ఉన్నట్లుగా
కథనాలు
అయితే
వస్తున్నాయి.
ఎందుకంటే
ఇటీవల
అతను
ఎక్కడ
ఉన్నా
కూడా
ఇలియానా
వెంటనే
అక్కడ
వాలిపోతొంది.
వారు
క్లోజ్
గా
ఉండడంతో
సోషల్
మీడియాలో
వార్తలు
మరింత
వైరల్
అవుతున్నాయి.

అలా స్టోరీ లీక్
అయితే రీసెంట్ గా కత్రినా కైఫ్ తన 39వ పుట్టినరోజును తన భర్త విక్కీ కౌశల్ తో సెలబ్రేట్ చేసుకుంది. ఆ సెలబ్రేషన్స్ లో కత్రినా సోదరుడు, బావ సన్నీ కౌశల్ అతని ఫ్రెండ్స్ శర్వరీ వాఘ్, మినీ మాధుర్ కూడా ఉన్నారు. మాల్దీవులలో జరుపుకున్న ఒక పార్టీలో కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్ కొన్ని ఫొటోస్ షేర్ చేసుకుంది. ఇక అందులో ఇలియానా ఉండడం వైరల్ గా మారింది.

అతను ఏం చేస్తుంటాడంటే..
కత్రినా సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో ఇలియానా ఉండడంతో అప్పటి నుండి బాలీవుడ్ మీడియాలో ఇలియానా, సెబాస్టియన్ మధ్య ప్రేమకథలు వైరల్ అవుతున్నాయి. ఇక సెబాస్టియన్ ఎవరంటే.. అతను లండన్‌కు చెందిన ఫ్యాషన్ మోడల్. ఇక ఇలియానాతో అతను గత 6 నెలలుగా డేటింగ్ లో ఉన్నట్లు టాక్ వస్తోంది.

పాత అపార్ట్‌మెంట్‌లో..
ఇక
ఈ
జంట
బాంద్రాలోని
కత్రినా
పాత
అపార్ట్‌మెంట్‌లో
అప్పుడప్పుడు
టైమ్
స్పీడ్
చేస్తున్నట్లు
కూడా
రూమర్స్
వస్తున్నాయి.
ఇలియానా
బర్త్
డే
పార్టీ
ఫొటోలు
పోస్ట్
చేయడంతో
వీరి
బంధంపై
మరింత
ఎక్కువ
వార్తలు
వస్తున్నాయి.
మరి
ఈ
విషయంలో
పోకిరి
భామ
ఎప్పుడు
క్లారిటీ
ఇస్తుందో
చూడాలి.