రెడ్ బికినిలో షాక్ ఇచ్చిన ఇలియానా.. అసలైన అందాలు హైలెట్ అయ్యేలా క్లోజ్ స్టిల్స్!
దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇలియానా డి క్రూజ్ ఎన్నేళ్లయినా కూడా అదే తరహాలో తన అందంతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొన్ని రోజులకే సాలీడ్ బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న ఇలియానా ఆ తర్వాత ఏ మాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమెకు ఎన్ని అపజయాలు వచ్చినా కూడా ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఏదో ఒక బాక్స్ ఆఫీస్ హిట్ కాపాడుతూ వచ్చింది. ఇప్పటికి కూడా ఆమెకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవల బికినీలో ఇలియానా మరోసారి షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

గ్లామర్ డోస్ గట్టిగానే
2006 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఇలియానా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా తన స్టార్ హోదాను అమాంతంగా పెంచుకుంది. ఇక ఆమె అందంతోనే అప్పట్లో కుర్రాళ్లను ఎంతగానో పిచ్చెక్కించింది. ఇలియానా సినిమాలో ఉంది అంటే తప్పకుండా గ్లామర్ డోస్ గట్టిగానే ఉంటుంది అనేలా ఒక క్రేజ్ అయితే అందుకుంది. ఇలియానా గ్రామర్ ప్రజెంటేషన్ లో కూడా వల్గారిటీ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పవచ్చు.

బాలీవుడ్ లో కూడా
పోకిరి జల్సా కిక్ జులాయి వంటి సినిమాలు ఆమె స్థాయి ఒక్కసారిగా పెంచేశాయి. అయితే మధ్య మధ్యలో ఎవరూ ఊహించని విధంగా కొన్ని ప్లాప్స్ కూడా అమె కెరీర్ ను సందిగ్ధంలో పడేశాయి. ఇక మరి కొన్నాళ్ళకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలియానా మంచి అవకాశాలు అందుకుని అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో కూడా బాక్సాఫీస్ హిట్స్ చూసింది. నార్త్ లో కూడా ఇలియానా ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది.
హాట్ బికినీలో..
ఇక ఇలియానాకు సినిమా అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్మడికి క్రేజ్ కూడా గట్టిగానే వచ్చింది. ఎందుకంటే సినిమాలో కూడా ఆమె ఎప్పుడు ఈ రేంజ్ లో కనిపించలేదు. కానీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో మాత్రం అప్పుడప్పుడు హాట్ బికినీ లో ఊహించని విధంగా దర్శనమిస్తోంది.
అందాలు హైలెట్ అయ్యేలా
ఇక ఇటీవల ఇలియానా ఒక రెడ్ బికినీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కనిపించింది. అసలైన అందాలు హైలెట్ అయ్యే విధంగా సెల్ఫీ ఫోటోలను తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఇక ఫోటోను చూసిన కుర్రాళ్ళు చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. 15 ఏళ్ళ క్రితం చూసిన ఇలియానా ఇప్పటికీ అలానే ఉందని అంటూ మరికొందరు తెలుగు ప్రేక్షకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
Recommended Video

విడిపోయారా?
సోషల్ మీడియాలో ఇలియానా ఎలాంటి స్టిల్స్ పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతుంది అని మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఆమె వయసు 35 అయినప్పటికీ ఇంకా పదహారేళ్ళ అమ్మాయిలానే కనిపిస్తోందని అంటున్నారు. ఇక ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్నట్లు కథనాలు చాలానే వచ్చాయి. ఆమె ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందని వారు ఇప్పటికే వివాహం చేసుకున్నారని పుకార్లు వచ్చాయి. ఇక 2019లోనే ఈ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంలో ఇలియానా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications