ఇది మామూలు రచ్చ కాదు.. బికినీ షోలో మరో లెవెల్.. అందాల ఆరబోత అవార్డ్ ఇలియానాకే!
మొదటి చిత్రం దేవదాస్‌తోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది ఇలియానా. ఈ సినిమాలో బికినీతో రచ్చ రచ్చ చేసి వేడి పుట్టించింది. ఇక రెండో మూవీ పోకిరితో టాలీవుడ్‌లో అగ్రస్థానాన్ని చేరుకుంది. అప్పట్లోనే కోటి పారితోషికం తీసుకున్న భామగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే తెలుగులో వచ్చిన విపరీతన పాపులార్టీని బాలీవుడ్ ఎంట్రీకి వాడుకుంది. అక్కడ బెడిసి కొట్టడంతో కెరీర్ ఎటూ కాకుండాపోయింది. ఇటు తెలుగులో విజయాలు లేక అటు బాలీవుడ్‌లో సక్సెస్ లేక సోషల్ మీడియాను శరణు వేడింది.

టాలీవుడ్ క్రేజ్‌ను అలా..
దేవదాస్, పోకిరి సినిమాలతో ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. జల్సా, రాఖీ వంటి చిత్రాలు ఆమె ఖాతాలో పడటం వెనువెంటనే సక్సెస్‌లు పలకరించాయి. ఇక్కడ క్రేజ్ పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్‌కు చెక్కేసింది ఇలియానా.

నటిగా ఓకే..
బాలీవుడ్‌లో ఇలియానా చేసిన చిత్రాలన్నీ బోల్తా కొట్టాయి. అయితే బర్ఫీ, రుస్తుమ్ల లాంటి చిత్రాలతో నటన పరంగా మంచి పేరునే తెచ్చిపెట్టాయి. కానీ ఇంతవరకు ఇలియానాకు ఒక్క కమర్షియల్ హిట్ రాలేదు. అందుకే ఇలియానా మళ్లీ టాలీవుడ్ వైపు ఆశగా చూసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా చేసిన దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని చిత్రాలు వర్కౌట్ కాలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్‌కే వెళ్లింది.

సోషల్ మీడియాలో హల్చల్..
ఇలియానా తన ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో ఓ రేంజ్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఆ మధ్య ప్రియుడు చేసిన ఫోటో షూట్లు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం బిచ్‌ల వెంటే తిరిగే ఇలియానా అందాల ఆరబోతలో స్పెషలిస్ట్‌గా మారింది. చాలా రోజుల తరువాత మళ్లీ బీచ్‌లో సేదతీరుతున్నట్టు కనిపిస్తోంది.
Recommended Video

బికినీతో రచ్చ..
ఇన్ని రోజులు లాక్ డౌన్ కారణంగా బీచ్‌లను మిస్ అవుతున్నానని ఇలియానా తెగ బాధపడేది. అయితే ప్రస్తుతం ఇలియానా బీచ్‌లో బికినీతో రచ్చ చేస్తోంది. ఇన్నాళ్ల ఎదురుచూపులు ఇప్పుడు ఫలించాయి. మంచి రోజులు వచ్చాయ్.. సాధారణ స్థితికి వచ్చాను అని ఇలియానా తన సంతోషాన్ని పంచుకుంది. ఇక ఇలియానా బికినీ షో చూస్తే ఎవ్వరికైనా మతి పోవాల్సిందే.


Click it and Unblock the Notifications











