తన టాటూల అర్థం చెప్పిన ఇల్లీ బేబీ.. ఎవరూ ఊహించని ఆన్సర్ ఇచ్చిందిగా.. వాళ్లిద్దరి పేర్లు లాగుతూ!

గోవా బ్యూటీ ఇలియానా తనదైన అందాల ఆరబోతతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టేసుకుంది. కొన్ని కోట్ల మంది అభిమానాన్ని దక్కించుకున్న ఈ భామ ఈ మధ్య కాలంలో సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం అందాలను ఆరబోస్తూ ట్రెండింగ్ లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటోంది. తాజాగా ఇలియానా తన ఒంటి మీద ఉన్న టాటూల గుట్టు విప్పేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

అలా ఎంట్రీ ఇచ్చి

అలా ఎంట్రీ ఇచ్చి

వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో రామ్ హీరోగా దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా వరుస సక్సెస్ లు అందుకుని ఒకప్పుడు టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. అలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలో బాలీవుడ్ అవకాశాలు రావడంతో ఇక్కడ హ్యాండిచ్చి ఆమె బాలీవుడ్ కి చెక్కేసింది. అయితే అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో పాటు పీకల్లోతు ప్రేమ విషయంలో బ్రేకప్ కావడంతో ఆమె చాన్నాళ్ళ పాటు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది.

లవ్ ఫెయిల్

లవ్ ఫెయిల్

ఈ భామ ఆండ్రూ అనే ఒక విదేశీ ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడింది. ఆ వ్యక్తితో చాలా కాలం చాలా కాలం పాటు ప్రేమలో మునిగి తేలింది ఇక పెళ్ళి మాత్రమే బ్యాలెన్స్ అనుకుంటున్న తరుణంలో ఏమైందో ఏమో కానీ వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఇలియానా మళ్లీ సినిమాల్లో రాణించడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా అప్పటికే టాలీవుడ్ కొత్త హీరోయిన్స్ తో హౌస్ ఫుల్ అయిపోవడంతో ఆమెకు టాలీవుడ్ లో అయితే పెద్దగా అవకాశాలు దక్కలేదు. అందుకే బాలీవుడ్ నే నమ్మికుంది.

ఇంటరాక్షన్ లో

ఇంటరాక్షన్ లో

టాలీవుడ్ నటి ఇలియానా ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా ప్రశ్నోత్తరాలు నిర్వహించి, కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన సినిమాల గురించి మాట్లాడడమే కాకుండా, నటి తన చేతిపై పచ్చబొట్లు వెనుక ఉన్న అర్థాన్ని కూడా వెల్లడించింది. ఒక అభిమాని ఆమెను, "హాయ్, మీ చేతిలో ఉన్న ఆ 3 చుక్కల అర్థం ఏమిటి?" అని అడగగా ఒక పెద్ద చుక్క మరియు రెండు చిన్న చుక్కలు ఉన్న పచ్చబొట్టు ఫోటోను చూపిస్తూ, అది తన ఇద్దరు సోదరీమణులు మరియు నేను అని ఆమె అభిమానికి చెప్పింది.

వాళ్లు ఇద్దరూ

వాళ్లు ఇద్దరూ

అంతే కాక ఆమె చిన్న చుక్కలు ఆమె అక్క అలాగే చెల్లిని సూచిస్తాయని వెల్లడించింది. ఇక ఇలియానా చివరిసారిగా 2018లో తెలుగులో అమర్ అక్బర్ ఆంథోనిలో కనిపించింది మరియు. ఆమె తెలుగులో అయితే ఏ ఇతర ప్రాజెక్ట్‌ లు అయితే ఒప్పుకున్నట్లు ఇప్పటి దాకా వార్తలు లేవు.

Recommended Video

Romantic Movie Premiere - Celebrities Response | Akash Puri, Ketika Sharma ​| Filmibeat Telug
బాలీవుడ్ లో బిజీ

బాలీవుడ్ లో బిజీ

అంతకు ముందు 2012లో 'దేవుడు చేసిన మనుషులు'లో కనిపించి తెలుగులో రెగ్యులర్‌గా నటించింది. ఇలియానా దేవదాసు, పోకిరి, కిక్, జులాయి తదితర చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఆమె ఇప్పుడు ఎక్కువగా హిందీ ప్రాజెక్ట్‌లలో కనిపిస్తుంది. త్వరలో తేరా క్యా హోగా లవ్లీలో కనిపించనుంది. ఆమె 2012లో హిట్ చిత్రం బర్ఫీతో హిందీలో అడుగుపెట్టింది! ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X