ఇలియానా సైడ్ బిజినెస్.. గట్టిప్లానే వేసిందా… అసలు విషయం ఏంటి?
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన నటి ఇలియానా ఇప్పుడు తెలుగు సినిమాలే చేయడం లేదు. చేయడం లేదు అనే కంటే ఆమెకు అవకాశాలు దక్కడం లేదు అనే చెప్పాలి.. తెలుగు సినీ చరిత్రలో ఓ హీరోయిన్ కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ గా రికార్డులకు ఎక్కిన ఈ గోవా బ్యూటీ తెలుగులో టాప్ హీరోయిన్ గా ఉన్న సమయంలో బాంబే చెక్కేసింది. అజ్జాడ వర్కౌట్ కాకపోవడంతో పాటు బరువు పెరగటంతో క్రమంగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నా వర్కౌట్ కావడం లేదు. దీంతో ఆమె సైడ్ బిజినెస్ చేయాలని ప్లాన్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video

మూడేళ్ళ క్రితం చివరి సినిమా
బరువు తగ్గిన ఈ గోవా భామ ఎలా అయినా సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది. హాట్ హాట్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ ప్రేక్షకుల దృష్టి తో పాటు దర్శక నిర్మాతల దృష్టిలో కూడా పడటానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది.. కానీ తెలుగులో ఆమె చివరిగా అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా చేసింది.. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలవడంతో మళ్లీ తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కలేదు.

అక్కడా అంతంతమాత్రమే
బాలీవుడ్ ని నమ్ముకుని అక్కడికి వెళ్ళింది కాబట్టి అరకొర అవకాశాలు ఇస్తున్నారు అక్కడ దర్శక నిర్మాతలు. ఈ ఏడాది ది బిగ్ బుల్, అన్ ఫెయిర్ అండ్ లవ్లీ అనే రెండు సినిమాల్లో ఆమె నటించింది.. ఇక ఆ తర్వాత ఆమెను సినిమాల్లోకి తీసుకునే దర్శకనిర్మాతలు కరువయ్యారు ఈ నేపథ్యంలోనే ఆమె మరో బిజినెస్ మొదలు పెడుతోంది అనే ప్రచారం పెద్ద ఎత్తున మొదలైంది.

బ్రేకప్ తో డిప్రెషన్
ఇప్పటికే ఒక బ్రేకప్ అయింది, సినిమా అవకాశాలు కూడా దాదాపు లేనట్లే. అందుకే ఆమె కేవలం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తాను కూడా లైన్ లోనే ఉన్నానని హిట్స్ ఇస్తోంది. నిజానికి లవ్ లో ఫెయిల్ అయిన తర్వాత ఈ భామ ఛానాళ్లు డిప్రెషన్లోకి వెళ్లి పోయింది. ఆ సమయంలో బాగా బరువు పెరిగిపోయిన ఈ భామకు ఆ తర్వాత మళ్లీ ఆ బరువు తగ్గడానికి తల ప్రాణం తోకకు వచ్చింది.

కొత్త బిజినెస్ నిజమేనా
ఇప్పుడు ఆ విషయాలన్నీ పక్కనపెట్టి సినిమాల్లో అవకాశాలు వస్తే వచ్చాయి లేదంటే లేదు అని ఇప్పుడు ఫుడ్ బిజినెస్ లోకి దిగిన అవకాశాలున్నాయనే ప్రచారం మొదలైంది. నిజానికి ఆమె కొద్ది రోజుల క్రితం తన సోషల్ మీడియా వేదికగా ఒక చాక్లెట్ హాట్ కేక్ ను షేర్ చేసింది. అలా షేర్ చేసిన సమయంలో నాకు మరో కెరీర్ ఆప్షన్ కనిపిస్తోంది అని సరదాగా కామెంట్ చేసింది. ఆమె సరదాగా కామెంట్ చేసిందో లేక సీరియస్ గా చేసిందో తెలియదు కానీ మీడియా వాళ్లు ఇంకేముంది ఇలియానా సైడ్ బిజినెస్ మొదలు పెడుతుంది అని ప్రచారం మొదలు పెట్టారు.

ఆమే చెప్పాలి
సినిమా కెరీర్ ఇక లేనట్లే అని భావిస్తున్న ఈ భామ ఆ తర్వాత రెస్టారెంట్ అలాగే బేకరీల చైన్ మొదలు పెట్టే యోచనలో ఉందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. గోవా భామ కావడంతో స్వతహాగా వాళ్లకు వ్యాపారం మీద ఆసక్తి ఉండటంతో ఈ వార్త నిజమే అని నమ్మే పరిస్థితి నెలకొంది..నిజానికి ఇప్పటికే ఇలియానాకి తన పేరు మీద డిజైనర్ గార్మెంట్స్ బోటిక్ ఉంది. దీనికి ముంబై, హైదరాబాద్‌లలో బ్రాంచెస్ ఉన్నాయి. మరి ఈ బేకరీ బిజినెస్ నిజమో కాదో ఆమె చెప్పాలి మరి.


Click it and Unblock the Notifications











