ఇలియానాను హాట్ ఫొటోలు అడిగిన నెటిజన్: సెగలు రేపే ఫొటోతో షాకిచ్చిన హీరోయిన్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు సుదీర్ఘ కాలం పాటు వరుస సినిమాలతో హవాను చూపించారు. అలాంటి వారిలో గోవా చిన్నది ఇలియానా ఒకరు. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసే ఈ అమ్మడు.. హీరోయిన్‌గా పరిచయం అయిన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చింది. ఇలా చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీలో సందడి చేసింది. అయితే, కొంత కాలంగా ఇలియానా సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా హాట్ ఫొటోలు అడిగిన నెటిజన్‌కు ఆమె షాక్ ఇచ్చింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

అలా పరిచయం.. ఫుల్ ఫేమస్
మోడల్‌గా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలోనే ఇలియానా 'దేవదాసు' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'పోకిరి' సహా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనక్కి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ చాలా కాలం హవాను చూపించింది.

అప్పటి నుంచి గ్యాప్ ఇచ్చేసి
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు హవాను చూపించిన ఇలియానా.. దాదాపు అందరు స్టార్లతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే, ఇక్కడ ఫేడౌట్ అవడంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. అక్కడ ఆమెకు మంచి వెల్‌కం దక్కింది. ఇక, చాలా గ్యాప్ తర్వాత ఇలియానా 'అమర్ అక్బర్ ఆంటోనీ'తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినా ఆమెకు మాత్రం లక్ కలిసి రాలేదు.

లవ్ ఫెయిల్యూర్.. డిప్రెషన్‌లో
టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న సమయంలోనే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. చాలా కాలం పాటు అతడితో కలిసి ఎంజాయ్ చేసి బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఈ అమ్మడు గర్భవతి అయిందని, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని, ఆత్మహత్యయత్నం చేసిందని కూడా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీగానే
బ్రేకప్ తర్వాత చాలా ఫ్యాట్‌గా తయారైన ఇలియానా.. ఇప్పుడు కెరీర్ మీద దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అన్ని భాషల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఇలా ఇప్పటికే హిందీలో పలు చిత్రాలను కూడా చేసింది. అలాగే, కొన్నింటిలో నటిస్తోంది. ఇక, తెలుగులోకి కూడా మళ్లీ ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, ఆమెకు మాత్రం అవకాశాలు దక్కట్లేదు.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా
అప్పట్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపినా.. కొంత కాలంగా పెద్దగా ప్రాజెక్టులు లేకున్నా ఇలియానా మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫలితంగా తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటోంది.

హాట్ ఫొటోలు అడిగిన నెటిజన్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఇలియానా.. అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తుంటుంది. అదే సమయంలో అప్పుడప్పుడూ తన ఫాలోవర్లతో చిట్ చాట్ కూడా నిర్వహిస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించగా.. అందులో ఓ నెటిజన్ 'కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేయ్' అని ఇలియానాను రిక్వెస్ట్ చేశాడు.

అలాంటి ఫొటోతో షాకిచ్చిందిగా
నెటిజన్ అడిగిన దానికి ఇలియానా చాలా తెలివిగా స్పందించింది. అతడు హాట్ ఫొటో అడగ్గానే.. వేసవిలో సెగలు రేగుతోన్న సమయంలో ఓ కుక్క ఫ్యాన్ గాలికి సేద తీరుతోన్నట్లు ఉన్న ఓ ఇమేజ్‌ను షేర్ చేసింది. తద్వారా అతడు అడిగిన హాట్ ఫొటో షేర్ చేసినట్లు అయింది. దీంతో వీళ్ల మధ్య జరిగిన దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











