ఒంటిపై నూలుపోగు లేకుండా ఇలియానా రచ్చ: ఇది మామూలు అరాచకం కాదుగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. కానీ, వారిలో కొంత మంది మాత్రమే స్టార్‌డమ్‌ను అందుకుని హవాను చూపించారు. అలాంటి వారిలో గోవా అందం ఇలియానా ఒకరు. పర్‌ఫెక్ట్ ఫిగర్ మాత్రమే కాదు.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ భామ.. చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత ఇతర పరిశ్రమల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అయితే, కొన్నేళ్లుగా ఇలియానా వెండితెరపై సరిగా సందడి చేయట్లేదు. కానీ, ఆ లోటును సోషల్ మీడియా ద్వారా తీర్చుకుంటోంది. ఇందులో అందాల విందు కూడా చేస్తోంది. తాజాగా ఇలియానా ఓ హాట్ ఫొటోను వదిలింది. దానిపై మీరూ లుక్కేయండి మరి!

అలా మొదలైన ఇలియానా కెరీర్

అలా మొదలైన ఇలియానా కెరీర్

'దేవదాసు' అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే దాదాపు తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితోనూ నటించింది. తద్వారా స్టార్‌ హీరోయిన్‌గా దూసుకెళ్లింది. అలాగే రెమ్యూనరేషన్‌ కూడా భారీగా అందుకుని రికార్డులు కొట్టేసింది.

స్టార్ స్టేటస్... వరుసగా ఫ్లాపులతో

స్టార్ స్టేటస్... వరుసగా ఫ్లాపులతో

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు తన హవా చూపించిన ఇలియానా.. కొన్నాళ్లు వరుస ఫ్లాపులు ఎదురవడంతో ఇక్కడ సినిమాలు తగ్గించేసింది. అదే సమయంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ అవకాశాల మీద అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే కొంత గ్యాప్ తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. కానీ, హిట్ ట్రాక్ మాత్రం ఎక్కలేకపోయింది.

లవ్ ట్రాకుతో సినిమాలకు గ్యాప్

లవ్ ట్రాకుతో సినిమాలకు గ్యాప్

వరుస ఆఫర్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. దీంతో అప్పటి నుంచి ఆమె కెరీర్ గాడి తప్పింది. ఇద్దరూ కలిసి గోవాలో ఓ ఇంటిలో ఉండడం.. ఎక్కడకు వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని కనిపించడం వంటి వాటితో ఆమె తరచూ వార్తల్లో నిలిచేది. ఒకానొక సందర్భంలో ఆమె ప్రెగ్నెంట్ అని టాక్ వచ్చింది.

ప్రియుడికి బ్రేకప్.. డిప్రెషన్‌లోకి

ప్రియుడికి బ్రేకప్.. డిప్రెషన్‌లోకి

చాలా కాలం పాటు ఆండ్రూతో డేటింగ్ చేసిన తర్వాత అతడికి ఇలియానా బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అప్పుడు ఆమె కెరీర్ పరంగా గాడి తప్పడంతో పాటు ఫిజిక్‌ను కూడా పోగొట్టుకుంది. అదే సమయంలో ఈమె ఆత్మహత్యకు యత్నించినట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఇక, ఇప్పుడు ఈ బ్యూటీ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయింది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

సినిమాలు చేసినా, చేయకపోయినా ఇలియానా మాత్రం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫలితంగా తన అందాలతో ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపిపడేస్తోంది.

అందాలను ఆరబోస్తూ హల్‌చల్

అందాలను ఆరబోస్తూ హల్‌చల్

సోషల్ మీడియాలో చాలా కాలంగా సందడి చేస్తోన్న ఇలియానా.. ఎక్కువగా అందాల విందు చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతూ ట్రెండింగ్ అవుతోంది.

బట్టల్లేకుండా దిగిన ఫొటోలో ఇలా

బట్టల్లేకుండా దిగిన ఫొటోలో ఇలా

ఈ మధ్య కాలంలో డోసు పెంచేసిన ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బట్టలు వేసుకోనట్లుగా కనిపించింది. అంతేకాదు, ఓ టోపీ అడ్డుగా పెట్టుకుని అందాలను కనిపించకుండా కవర్ చేసింది. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X