మళ్ళీ సరికొత్తగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఇలియానా.. ఆ హీరో కోసం తప్పట్లేదు..

దేవదాసు సినిమాతో వెండితెరకు పరిచయమైన గ్లామర్ బ్యూటీ ఇలియానా ఆ తర్వాత వరుస బాక్సాఫీస్ హిట్ తో లక్కీ హీరోయిన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహేష్ బాబు - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా పోకిరిలో నటించి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది. ఆ ఒక్క హిట్ తో అమ్మడి తలరాతనే మారిపోయింది. పోకిరి క్రేజ్ తోనే అప్పట్లో ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా వరుసగా అవకాశాలు అందుకుంది. ఇక 2006లో ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే వరుసగా నాలుగు సినిమాలకు సైన్ చేసింది. ఆ తరువాత ఖతర్నాక్ రాఖీ వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఒక ఏడాది పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనంతరం జల్సా, కిక్ అంటూ మధ్య మధ్యలో రెండు సినిమాలు అమ్మడికి మంచి బూస్ట్ ఇచ్చాయి.

అది ఇలియానా బ్యాడ్ లక్ ఏమిటో గాని ఆ తరువాత పెద్ద సినిమాలు పెద్దే దెబ్బె కొట్టాయి. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసినా కూడా ఆ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. ఆమె సక్సెస్ రేటు చాలా తక్కువ అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కొన్నిసార్లు దర్శకులతో హీరోలతో మంచి స్నేహం ఉండటం వలన కూడా తప్పక ఒప్పుకోవలసి వచ్చిందని కథనాలు కూడా వచ్చాయి. ఆ విధంగా ఇలియానా కొన్ని చేయకూడని సినిమాలు చేసే తొందరగానే కెరీర్ డౌన్ ఫాల్ అయ్యేలా చేసుకుందనే కామెంట్స్ కూడా వచ్చాయి.

Ileana DCruz special song in ravi teja upcoming movie

ఇక ఈ బ్యూటీకి చాలా రోజుల తర్వాత కొన్ని విభిన్నమైన అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఏడాదికి ఒక సినిమా చేసుకుంటూ వెళుతోంది. ఇక చివరగా 2018లో మాస్ మహారాజా రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ఇలియానా టాలీవుడ్ పై పెద్దగా ఫోకస్ పెట్టింది లేదు. మెల్లగా బాలీవుడ్ లోనే అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోసారి ఈ బ్యూటీకి రవితేజ నుంచి ఒక ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. రవితేజ సినిమాలో ఇలియానా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుందట.

ఇప్పటివరకు ఇలియానా ఐటెం సాంగ్స్ లో అంతగా మెరిసింది లేదు. రవితేజతో ఆమె గతంలో 4 సినిమాలు చేసింది. కిక్ సినిమా తప్పితే ఖాతర్నాక్, దేవుడు చేసిన మనుషులు అమర్ అక్బర్ అంథోని సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.అయినప్పటికీ ఇలియానాతో రవితేజకు మంచి స్నేహం ఉంది. ఆమెను స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రవితేజ 68వ సినిమాకు ఇటీవల రామారావు అన్ డ్యూటీ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుండగా రాజీష విజయన్ మరొక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X