హాట్ టాపిక్: పవన్ కల్యాణ్ భార్య ఆమె కాదు.. పవర్ స్టార్‌తో రెండోసారి కలవబోతున్న స్టార్ హీరోయిన్.!

By Manoj

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. ఎంతో కష్టపడి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. అశేషమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. సినిమాల్లో సత్తా చాటిన ఈ మెగా హీరో.. రాజకీయాల్లోకి సైతం ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఓ పార్టీని కూడా స్థాపించాడు. ఇక, సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్.. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

ఫ్యాన్స్ కోరికను తీర్చిన పవన్ కల్యాణ్

ఫ్యాన్స్ కోరికను తీర్చిన పవన్ కల్యాణ్

వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి' తర్వాత మరోసారి మేకప్ వేసుకోలేదు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వెళ్లినప్పటికీ.. సినిమాలకు దూరం అవడంతో ఆయన అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో పవర్ స్టార్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే పలు ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపేశాడు.

ఒకటి కాదు.. ఏకంగా మూడు ఫిక్స్

ఒకటి కాదు.. ఏకంగా మూడు ఫిక్స్


పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుండడంతో అందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు. దీనికి కారణం ఆయన ఒకేసారి మూడు సినిమాలను లైన్‌లో పెట్టడమే. వీటిలో ఒకటి వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ‘వకీల్ సాబ్' కాగా, రెండోది క్రిష్ జాగర్లమూడితోనూ, మూడో మూవీ హరీశ్ శంకర్‌తోనూ చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

పవన్ కల్యాణ్ సాహసోపేత నిర్ణయం

పవన్ కల్యాణ్ సాహసోపేత నిర్ణయం

ఇండస్ట్రీలోనే అత్యంత భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో రీఎంట్రీ ఇస్తున్నాడంటే మామూలు విషయం కాదు. దీనిపై ఎన్నో అంచనాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా ఆ సినిమా ఉండాలి. అయితే, పవన్ కల్యాణ్ మాత్రం తన రీఎంట్రీకి బాలీవుడ్ సినిమా రీమేక్‌ను ఎన్నుకున్నాడు. చాలా మందికి తెలిసిన కథతోనే ఆయన సినిమా రాబోతుండడం సాహసమే అని చెప్పాలి.

హైలైట్ చేసేందుకు అలా చేస్తున్నారు

హైలైట్ చేసేందుకు అలా చేస్తున్నారు

బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం ‘పింక్'. భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ఇప్పటికే తమిళంలో రీమేక్ చేశారు. ఈ రెండు మూవీల్లో హీరో పాత్ర ఎలివేట్ అయి ఉండదు. అయితే, ‘వకీల్ సాబ్'లో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోందని అంటున్నారు. పవన్ కోసం సినిమాలో చాలా మార్పులు చేశారని ప్రచారం జరుగుతోంది.

పవన్ కల్యాణ్ భార్య ఆమె కాదు

పవన్ కల్యాణ్ భార్య ఆమె కాదు


ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ‘వకీల్ సాబ్'లో హాట్ బ్యూటీ శృతి హాసన్ కీలక పాత్ర చేస్తుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. అది కూడా పవన్ కల్యాణ్ భార్య పాత్ర అని వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ పాత్రను చేయడానికి ఆమె సిద్ధంగా లేదట. ప్రస్తుతం ఆమె పలు చిత్రాలతో బిజీగా ఉండడమే దీనికి ప్రధాన కారణం అని సమాచారం.

Recommended Video

Maguva Maguva Lyrical Song | Vakeel Saab First Song Out | Filmibeat Telugu
రెండోసారి కలవబోతున్న స్టార్ హీరోయిన్.!

రెండోసారి కలవబోతున్న స్టార్ హీరోయిన్.!


కొద్దిసేపు మాత్రమే ఉన్నప్పటికీ ఎంతో ప్రాధాన్యత ఉన్న ఆ పాత్ర కోసం గోవా బ్యూటీ ఇలియానాను తీసుకుంటున్నారని తాజాగా ఓ వార్త లీక్ అయింది. ‘అమర్ అక్బర్ ఆంటోని' తర్వాత మరో తెలుగు సినిమాలో నటించని ఇల్లీ బేబి.. పవన్‌తో నటించేందుకు సై అందని సమాచారం. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘జల్సా' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X