ఇలియానా ఇంట్లో విషాదం.. ఆత్మీయ వ్యక్తి మృతితో కంటతడి
తనకు అత్యంత ఇష్టమైన అంకుల్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో హీరోయిన్ ఇలియానా డిక్రజ్ కన్నీటిపర్యంతానికి గురయ్యారు. తాను రెండో తండ్రిగా భావించే వ్యక్తి ఇకలేరనే బాధతో భావోద్వేగానికి గురైన ఇలియానా తన బాధను ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించారు. ఆయనపై ఉన్న ఇష్టాన్ని, ఆయన లేరనే బాధను అక్షరాల రూపంలో వెల్లడించారు. ఇన్స్‌టాలో పోస్ట్ చేసిన వీడియోలో..

అంకుల్ ఆకస్మిక మృతి
ఇలియానాకు ఇష్టమైన తన బంధువు తిరు ఆకస్మిక మృతి చెందారు. తనను రెండో తండ్రిగా ఇలియానా భావిస్తారు. అలాంటి వ్యక్తి తన జీవితం నుంచి నిష్క్రమించే సరికి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతి వార్తతో కంటతడి పెట్టారు. తీవ్ర విషాదంలోకి జారుకొన్నారు.

బాధతో మాటలు రావడం లేదు
తిరు మృతి కారణంగా విషాదం నుంచి తేరుకొన్న ఇలియానా తన ఇన్సాటాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. నీవు లేవన్న బాధతో మాటలు రావడం లేదు. మీ గురించి చాలా ఫొటోలు, వీడియోలు, ఆడియోలు పోస్టు చేసి నా బాధను చెప్పాలనుకొంటున్నాను. నాకు తెలిసి ఈ ప్రపంచంలో నీలాంటి గొప్ప మనిషి మరొకరు ఉండరు. నీ గురించి ఎక్కువ రాయలేకపోతున్నాను. ఎందుకంటే ఇంకా నీవు ఉన్నావనే భ్రమలోనే బతుకుతున్నాను అని ఇలియానా అన్నారు.
నీతో మరింత సమయం
నీవు ఈ లోకం నుంచి వెళ్లిపోయాక నీతో ఇంకా చాలా సమయం గడిపితే బాగుండనే ఫీలింగ్ కలుగుతున్నది. మనం ఇంకా ఎక్కువ సమయాన్ని గడపాల్సి ఉండాల్సిందనిపిస్తున్నది. జంతువులపై నీవు చూపించే దయాగుణం నాకు చాలా ఇష్టం అని ఇలియానా తన పోస్టులో తెలిపారు.
Recommended Video

పీడకల అనిపిస్తే బాగుండు
ఇంకా నీవు లేవనే విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను. మళ్లీ ఉదయం లేవగానే ఇదో పీడకల అనిపిస్తే బాగుంటుందని అనుకొంటున్నాను. నీతో మరోసారి మాట్లాడాలనే కోరిక కలుగుతున్నది. అలాగే ఇంకా ఎక్కువ సమయం గడిపితే బాగుంటుదనే ఫీలింగ్ కలుగుతున్నది అని ఇలియానా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











