వాటిని ఇలా ఎవ్వరూ చూపించరు.. జూమ్ చేసి మరీ.. బికినీలో ఇలియానా
ఇలియానా అనగానే తెలుగు అభిమానులకు నడుము ఒంపుసొంపులు ఆ వయ్యారాలే గుర్తుకు వస్తుంటాయి. ఒకప్పుడు ఇలియానా అంటే తెలుగు ప్రేక్షకులు పడి చచ్చిపోయేవారు. దేవదాస్, పోకిరి ఇలా వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టేసింది. ఇక ఇలియానా అందాలకు కుర్రకారంతా ఫిదా అయ్యారు. అయితే ఇలియానా బాలీవుడ్‌కు వెళ్లడంతో తెలుగు ప్రేక్షకులు నిరుత్సాహ పడ్డారు. కానీ ఇలియానాకు మాత్రం బాలీవుడ్‌లో నిరాశేఎదురైంది.

టాలీవుడ్‌లో అలా..
దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఆ తరువాత వెంటనే పోకిరితో ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. సీనియర్, కుర్ర హీరోలందరితోనూ ఇలియానా నటించేసింది. ప్రభాస్‌తో మున్నా, ఎన్టీఆర్‌తో శక్తి, పవన్ కళ్యాణ్‌తో జల్సా ఇలా ప్రతీ ఒక్క హీరోతో నటించేసింది.

బాలీవుడ్‌కు పయణం..
ఇలియానా తెలుగులో ఎక్కువగా రవితేజ సరసన నటించింది. మూడు నాలుగు చిత్రాల్లో నటించినా కూడా కిక్ మాత్రమే వర్కవుట్ అయింది. అయితే తెలుగులో ఇలియానాకు వచ్చిన క్రేజ్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టేసింది. కానీ అక్కడ అంతగా క్లిక్ అవ్వలేదు. ఇలియానా నటించిన బాలీవుడ్ చిత్రాలన్నీ బోల్తా కొట్టేశాయి.

సోషల్ మీడియాలో అలా..
ఇలియానాకు అంతగా ఆఫర్లు లేకపోయినా ఎప్పుడూ కూడా ట్రెండింగ్‌లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఇలియానా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వర్కవుట్లు, బీచ్‌లు, బికినీలు అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటుంది. ఆమె షేర్ చేసే ఫోటోలు చూస్తుంటే సోషల్ మీడియా హీటెక్కడం ఖాయం.

బికినీ అందాల ఆరబోత..
ఇలియానాకు బీచ్‌ల వెంట తిరగడం ఎంతో ఇష్టం. నిత్యం బికినీలోనే దర్శనమిస్తూ ఉంటుంది. ఫోటో గ్రాఫర్ ఆండ్రూతో ప్రేమలో ఉన్న సమయంలో అయితే వెరైటీ ఫోటో షూట్లతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. తాజాగా ఇలియానా ఓ పోస్ట్ చేసింది.

వాటిని చూపిస్తూ..
తాజాగా ఇలియానాఅద్దం ముందు నిల్చుని తన బెల్లీ ఫ్యాట్, ట్యాన్ గురించి చెప్పుకొచ్చింది. నడుము మీదున్న చారలను జూమ్ చేసి మరీ చూపించింది. మొత్తానికి అద్దంలో ఇలియానా అందాలు క్లియర్‌గా కనిపించడంతో అందరూ ఫిదా అవుతున్నారు.


Click it and Unblock the Notifications











