Ileana D'Cruz బేబీ బంప్‌తో ఇలియానా గ్లామర్ ట్రీట్.. ఇన్స్‌టాగ్రామ్ పోస్టు వైరల్!
అందాల భామ ఇలియానా డీ క్రూజ్ జీవితంలో కీలకమైన అనుభూతిని పొందుతున్నది. కొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఇలియానా తన అనుభవాలను ఇన్స్‌టాగ్రామ్ ద్వారా పంచుకొంటున్నారు. అయితే పెళ్లి కాకుండానే రిలేషన్‌షిప్‌లో ఉంటూ గర్బదాల్చడం మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి వార్తలను పట్టించుకోకుండా తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. ఇలియానా వ్యక్తంగత జీవితం, ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టుల వివరాల్లోకి వెళితే..
దక్షిణాదిలో ఇలియానా డీ క్రజ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందడంతోపాటు భారీ పారితోషికాన్ని అందుకొన్నది. అయితే తెలుగులో అగ్రహీరోలతో నటించిన ఈ గోవా సుందరి .. టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే టాలీవుడ్‌లో స్టార్ డమ్‌ను పెంచుకొన్నట్టుగా బాలీవుడ్‌లో సంపాదించుకోలేకపోయింది. అయితే అడపదడపా సినిమాలో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది.

ఇక ఇలియానా వ్యక్తిగత జీవితంలోకి వెలితే.. ఆమె టాలీవుడ్‌లో అగ్రహీరోలతో డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు వార్తలుగానే ఉండిపోయాయి. కానీ ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ఫోటోగ్రాఫర్ అండ్రూ నీబోన్‌తో ప్రేమలో పడింది. వారిద్దరూ సహజీవనం కూడా చేస్తూ మీడియాకు దొరికిపోయారు. అయితే పెళ్లి జరిగినట్టు ఎక్కడా చెప్పుకోలేదు. దాంతో తన భర్త అంటూ క్లెయిమ్ చేసుకోకపోవడంతో బాయ్‌ఫ్రెండ్‌గానే గుర్తిస్తున్నారు.
అండ్రూ నీబోన్‌తో రిలేషన్‌షిప్ గురించి మీడియా పలుమార్లు ప్రస్తావిస్తే.. నా జీవితం ప్రైవేట్. నా ప్రైవేట్ లైఫ్‌ను మీడియాతో పంచుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మరోసారి నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకూడదు అని కండీషన్లు పెట్టింది. అయితే అండ్రూ నీబోన్‌తో పెళ్లి వ్యవహారం జరుగలేదనేది స్పష్టమైన విషయం.

తాజాగా ఇలియానా తన బేబీ బంప్ ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. గర్బాన్ని చూపిస్తూ మోకాళ్ల పైకి వరకు కనిపించే విధంగా పొట్టి దుస్తులతో అందాలను ఆరబోసింది. థై స్లిట్ గౌన్‌లో అందంగా కనిపించింది. ఆమె పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తల్లి కాబోతున్న ఇలియానా మరింత గ్లామర్‌గా కనిపించింది.
ఇలియానా తన బేబీ బంప్ ఫోటోను షేర్ చేసి.. మై లిటిల్ వన్ అంటూ కామెంట్ చేసింది. ఫోటోతోపాటు పుచ్చకాయ ముక్కను కూడా పోస్టు చేసింది. ఇలియానా పోస్టుకు నెటిజన్లు, అభిమానుల నుంచి భారీగా కామెంట్లు కనిపిస్తున్నాయి. తల్లికాబోతున్న మీకు శుభాకాంక్షలు. మీరు మరింత అందంగా కనిపిస్తున్నావు అని కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











