Ileana: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా? ఫొటో చూశారా?

తెలుగు ప్రేక్షకుల్లో గోవా సుందరి ఇలియానా (Ileana D'Cruz) చెరగలేని ముద్ర వసుకుంది. ఎంతమంది హీరోయిన్స్ తెరపై సందడి చేసిన ఈ పోకిరి భామను మాత్రం అంతగా మర్చిపోలేరు. ఆమె అందచందాలకు యూత్ అంతా ఫిదా అయింది. తెలుగులో అనేక సినిమాల్లో సందడి చేసిన ఈ బ్యూటిఫుల్ తర్వాత బాలీవుడ్ లో స్థిరపడిపోయింది.

అనంతరం సినిమాలకు దూరంగా ఈ వయ్యారి సోషల్ మీడియాలో ఘాటు ఫొటోలతో రచ్చ చేసేది. అలానే తాను ప్రెగ్నెంట్ అని పెద్ద షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పండంటి మగ బిడ్డకు (Ileana Son )జన్మనిచ్చింది. ఇలియానా తన బాబుకు పేరు కూడా పెట్టేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

Ileana DCruz

ఇద్దరూ ఒకేసారి: రామ్ పోతినేని, ముద్దుగుమ్మ ఇద్దరూ దేవదాసు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేశారు. 20 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన స్టన్నింగ్ బ్యూటి ఇలియానా తన మొదటి సినిమాలోనే యాక్టింగ్, గ్లామర్‌తో ఆకట్టుకుంది. గ్లామర్ ఒలకబోయడంతో ఆమె అందరి దృష్టినీ విపరీతంగా ఆకర్షించింది. దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్లు భారీగా వచ్చాయి.

Ileana DCruz

స్టార్‌డమ్‌: దేవదాసు తర్వాత ఇలియానాకు భారీ ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇలియానా టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరితోనూ నటించింది. అలా సెకండ్ సినిమాగా పూరి, మహేశ్ బాబు కాంబినేషన్ లో పోకిరి సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది ఇల్లు బేబి. ఇందులో శృతిగా యావత్ యూత్ ను ఫిదా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. ఇలా ఎన్నో హిట్లు కొట్టేసి స్టార్‌డమ్‌ను అందుకుంది ఇలియానా.

సినిమాల లిస్ట్: ముద్దుగుమ్మ ఇలియానా రాఖీ, కిక్, రెచ్చిపో, ఖతర్నాక్, భలే దొంగలు, ఆట, సలీమ్, నేను నా రాక్షసి, దేవుడు చేసిన మనుషులు, మున్నా, శక్తి, జల్సా, జులాయి, అమర్ అక్బర్ ఆంటోని వంటి తెలుగు చిత్రాలు చేసి ఆకట్టుకుంది. తర్వాత బాలీవుడ్ లో కి వెళ్లి స్థిరపడింది. అక్కడ బర్ఫీ, పాటా పోస్టర్ నిక్లా హీరో, మెయిన్ తేరా హీరో, హ్యాపీ ఎండింగ్, పాగల్ పంతీ, రైడ్, రుస్తూం వంటి సినిమాలతో అలరించింది.

Ileana DCruz Blessed With Baby Boy And Named As Koa Phoenix Dolan

పెళ్లి కాకుండానే: హిందీలో 2021లో బిగ్ బుల్ అనే సినిమాలో చివరిగా నటించిన ఇలియానా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం గ్లామర్, అందాలు ఆరబోసే ఫొటోలతో అట్రాక్ట్ చేస్తూ వచ్చేది. ఈ క్రమంలోనే ఇటీవల తాను ప్రెగ్నెంట్ అని పెద్ద షాక్ ఇచ్చింది. నిత్యం బేబి బంప్ ఫొటోలు పెడుతూ అప్డేట్స్ ఇచ్చేది. అయితే ఆమె ప్రెగ్నెంట్ కావడానికి ఎవరు కారణం అని మాత్రం చెప్పలేదు. ఇక తాజాగా పెళ్లి కాకుండానే తల్లి అయింది ఇల్లు బేబి.

బాబు పేరు: తాజాగా ఇలియానా (Ileana Blessed With Baby Boy) పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆగస్టు 1న తనకు అబ్బాయి పుట్టినట్లు తెలిపింది ఇలియానా. తన బాబు ఫొటోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా తన కుమారుడికి 'కోవా ఫోనిక్స్ డోలాన్' (Koa Phoenix Dolan) అని పేరు పెట్టినట్లుగా కూడా చెప్పేసింది.

Ileana DCruz

ఆలస్యంగా: తనకు కొడుకు పుట్టినట్లు కాస్తా ఆలస్యంగా చెప్పిన ఇలియానా ఎమోషనల్ గా నోట్ రాసుకొచ్చింది. బాబు ఫొటోను షేర్ చేస్తూ "ఈ ప్రపంచంలోకి మా డార్లింగ్ బాబుకు స్వాగతం పలకడానికి మేం ఎంతో సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పాం. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి" అని ఇలియానా తెలిపింది. అయితే ఇప్పటికీ కూడా బాబు తండ్రి ఎవరు అనేది ఇలియానా చెప్పకపోవడం గమనార్హం.

ఆ హీరోయిన్స్: ఇక ఇలియానా షేర్ చేసిన ఫొటోకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు హ్యూమా ఖురేషి, నర్గిస్ ఫక్రి, అతియా శెట్టి తదితరులు కంగ్రాట్స్ తెలిపారు. కాగా కత్రీనా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో ప్రేమాయణం సాగించిందని వార్తలు వచ్చాయి. కానీ, ఇటీవల ఒక వ్యక్తితో ఉన్న ఫొటో షేర్ 'డేట్ నైట్' అని చెబుతూ పోస్ట్ చేసింది. అతనే ఇలియానా ప్రెగ్నెంట్ కావడానికి కారణం అని చర్చ నడిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X