మరోసారి తల్లికాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలతో హింట్!
ప్రస్తుతం సినీ తారలు ఒకరి తర్వాత ఒకరు శుభవార్తలు చెబుతున్నారు. బాలీవుడ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ - సిద్ధార్ద్ మల్హోత్రాలు తాము త్వరలో తల్లిదండ్రులుం కాబోతున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే మెగా వారసుడు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిలు కూడా శుభవార్త చెప్పి మెగా ఫ్యాన్స్‌కి పండగ తెచ్చారు. దాదాపు రెండేళ్లుగా ఈ శుభవార్త ఎప్పుడు చెబుతారా? అని ఎదురు చూస్తోన్న మెగా కుటుంబానికి, అభిమానులకు వీరు ఎంతో ఆనందం కలిగించారు. తాజాగా టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోయిన్ రెండోసారి గర్భం దాల్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
కోటి రూపాయల పారితోషికంతో ఇండస్ట్రీ షేక్
తన నడుము, బాడీ ఫిగర్‌తో కొన్నేళ్ల పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు ఇలియానా. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మను వైవీఎస్ చౌదరి దేవదాసు సినిమాతో తెలుగువారికి పరిచయం చేశారు. తొలి సినిమాతోనే కుర్రాళ్లను వెర్రెక్కించిన ఇలియానా.. ఆ వెంటనే పోకిరి, మున్నా, ఆటా, జల్సా, కిక్, రెచ్చిపో, రాఖీ, జులాయి తదితర చిత్రాలతో స్టార్‌గా అవతరించారు. తొలిసారిగా కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేసి నిర్మాతలకు షాకిచ్చారు ఇల్లిబేబ్. సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఆమె కెరీర్‌ను వరుస ఫ్లాప్స్ నిండా ముంచాయి.

వరుస ఫ్లాప్‌లతో టాలీవుడ్‌కి టాటా
రెచ్చిపో, సలీం, శక్తి, నేను నా రాక్షసి, దేవుడు చేసిన మనుషులు సినిమాల డిజాస్టర్ కావడంతో ఇలియాన కెరీర్ పాతాళానికి పడిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో బాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడంతో హిందీలో అడుగుపెట్టిన ఆమెకు అక్కడా కాలం కలిసి రాలేదు. ఏదో ఒకటి రెండు హిట్స్ తప్పించి ఇలియానా సాధించింది ఏం లేదు. తిరిగి తెలుగువారిని పలకరించాలనే ఉద్దేశంతో లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీలో నటించగా ఈ సినిమా కూడా దారుణ పరాజాయాన్ని చవిచూసింది. ఇక చావో రేవో హిందీ పరిశ్రమలోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్న ఇలియానా ముంబైని వదిలి రావడం లేదు.
భారత పౌరసత్వాన్ని వదులుకున్న ఇలియానా
ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీబోన్ అనే ఫోటోగ్రాఫర్‌తో ప్రేమాయణం సాగించిన ఇలియానా 2019లో ఆయనతో బ్రేక్ చెప్పింది. తర్వాత మైఖేల్ డోలన్ అనే విదేశీయుతో డేటింగ్ చేసిన ఇల్లీబేబ్ గర్భం దాల్చింది. 2023 ఆగస్ట్‌లో ఓ బాబుకు జన్మనిచ్చింది. 2014లోనే తన భారత పౌరసత్వాన్ని వదులుకున్న ఇలియానా పోర్చుగీస్ పౌరసత్వం పొందింది. తన పూర్వీకులు పోర్చుగీస్‌కి చెందినవారేనని ఆమె పలుమార్లు తెలిపారు.
రెండోసారి గర్భం దాల్చిన ఇలియానా
ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తరచుగా పాడ్‌కాస్ట్స్, ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రేమ, రిలేషన్, పిల్లల గురించి తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ.. నా పిల్లలను దయగల వారిగా, ఎప్పుడూ సంతోషంగా ఉండేలా పెంచాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇలియానా మరోసారి గర్భం దాల్చినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎవ్వరూ నోరు మెదపలేదు. తాజాగా తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఇలియానా. తన స్నేహితురాలితో కలిసి దిగిన ఫోటోని పంచుకోగా.. ఇందులో ఇద్దరూ బేబీ బంప్స్‌తో కనిపించారు. దీనికి బంప్ బడ్డీస్ అని క్యాప్షన్ పెట్టారు. దీంతో ఇలియానా గర్భం దాల్చినట్లు నిర్థారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమెకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











