ఇండస్ట్రీ క్రూరమైనది.. ఇక్కడ లెక్కలు ఇంతే... ఇలియానా సంచలన వ్యాఖ్యలు!

తెలుగులో ఓ సామెత ఉంటుంది. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అని, అంటే అవసరం ఉన్నంత వరకు ఒకలా మాట్లాడడం అవసరం అయిపోయాక ఒకలా మాట్లాడడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది.. మరీ ముఖ్యంగా హీరోయిన్ గా పలు అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్ గా ఇలియానా ఇప్పుడు క్రేజ్ తగ్గాక సినీ పరిశ్రమ మీద చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

Recommended Video

Ileana D’Cruz Viral Pic || మొత్తం చూపించేస్తూ పిచ్చెక్కిస్తోంది..!!
బాలీవుడ్ కి జంప్

బాలీవుడ్ కి జంప్

దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా వరుస సినిమాలతో ఒకప్పుడు టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలో బాలీవుడ్ అవకాశాలు రావడంతో ఆమె బాలీవుడ్ కి పరిమితం అయింది.

బ్యాడ్ బ్రేకప్

బ్యాడ్ బ్రేకప్

అయితే అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో పాటు బాడ్ బ్రేకప్ కావడంతో ఆమె చాన్నాళ్ళ పాటు డిప్రెషన్ కి గురి అయింది.. ఈ భామ ఒక విదేశీ ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడింది ఆండ్రూ అనే ఆ వ్యక్తితో చాలా కాలం చాలా కాలం పాటు ప్రేమలో మునిగి తేలింది ఇక పెళ్ళి మాత్రమే బ్యాలెన్స్ అనుకుంటున్న తరుణంలో వారిద్దరూ విడిపోయారు.

బ్యాక్ టు టాలీవుడ్

బ్యాక్ టు టాలీవుడ్

ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఇలియానా మళ్లీ టాలీవుడ్ లో రాణించడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా అప్పటికే టాలీవుడ్ కొత్త హీరోయిన్స్ తో హౌస్ ఫుల్ అయిపోవడంతో ఆమెకు టాలీవుడ్ లో కూడా పెద్దగా అవకాశాలు దక్కలేదు.. దీంతో మళ్లీ బాలీవుడ్ లోనే ఇలియానా ప్రయత్నాలు చేస్తోంది.

క్రూరమైంది

క్రూరమైంది

తాజాగా ఈ భామ సినీ పరిశ్రమ గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.. సినీ పరిశ్రమ చాలా క్రూరమైంది అని ఆమె పేర్కొన్నారు. ఒక నటుడి ఇమేజ్ మరియు కెరీర్‌ను కాపాడుకోవడం విషయంలో చిత్ర పరిశ్రమ భయంకరంగా ఉందని ఆమె అన్నారు. ప్రేక్షకులు మీపై ఆసక్తి కలిగి ఉన్నంత కాలం మాత్రమే మీకు అవకాశాలు ఉంటాయని, ఆ ఆసక్తి నశించిన తర్వాత, మీరు అసలు ఎన్నడూ ఇండస్ట్రీలోనే లేరన్నట్లుగా మిమ్మల్ని దూరంగా పెడతారని పేర్కొంది.

సినిమా ప్రపంచం అలాంటిదేనని నాకు కూడా అదే జరిగిందని ఆమె పేర్కొంది. పాపులారిటీ ఉంటేనే ఇక్కడ అవకాశాలు ఉంటాయని లేకపోతే అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది.

బేకరీ బిజినెస్

బేకరీ బిజినెస్

ఇక మొన్నీమధ్య ఈ భామ బేకరీ పెట్టబోతోంది అంటూ ప్రచారం కూడా జరిగింది. ఇక ఆ విషయం మీద ఎలాంటి క్లారిటీ మాత్రం లేదు. నిజానికి ఇలియానా గతంలో కూడా సౌత్ ఇండస్ట్రీ మీద సంచలన కామెంట్స్ చేసి వార్తల్లోకెక్కింది. సౌత్ డైరెక్టర్లు చాలామంది తనను కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం చేశారని ఆమె అప్పట్లో కామెంట్ చేసింది.

సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

ఇక సినిమాల విషయానికొస్తే చివరిగా తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు మళ్లీ తెలుగులో అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత బాలీవుడ్లో మరో రెండు సినిమాల్లో ఆమె నటించింది. ఇక ఆమె నటిస్తున్న ఫెయిర్ అండ్ లవ్లీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కి సిద్ధంగా ఉంది.

More from Filmibeat

Read more about: ileana dcruz film industry
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X