అతడి వల్ల ప్రెగ్నెంట్ అయిన ఇలియానా: అబార్షన్ తర్వాత ఆత్మహత్యాయత్నం.. సంచలన విషయాలు లీక్ చేసిన బ్యూటీ

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, వారిలో కొందరు మాత్రమే పోటీని తట్టుకుని నిలబడగలుగుతారు. అందులోనూ చాలా తక్కువ మంది మాత్రమే స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతారు. ఈ జాబితాలోకే వస్తుంది గోవా చిన్నది ఇలియానా. టీనేజ్‌లోనే హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని స్థాయికి ఎదిగిపోయింది. బాలీవుడ్‌లోకి వెళ్లిన తర్వాత వివాదాస్పదం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన ప్రెగ్నెన్సీ, ఆత్మహత్య గురించి సంచలన విషయాలు లీక్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

హీరోయిన్‌గా ఎంట్రీ... కెరీర్ సాగిపోయిందిలా

హీరోయిన్‌గా ఎంట్రీ... కెరీర్ సాగిపోయిందిలా

టీనేజ్‌లోనే రామ్ పోతినేని హీరోగా పరిచయం అయిన 'దేవదాసు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. అందులో మెప్పించడంతో వెంటనే బోలెడు అవకాశాలను అందుకుంది. ఈ క్రమంలోనే దాదాపు తెలుగులో ఉన్న బడా హీరోలు అందరితోనూ నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అయితే, ఆ తర్వాత వరుస ఫ్లాపుల వల్ల టాలీవుడ్‌కు దూరమైంది.

బాలీవుడ్‌ నుంచి మళ్లీ తెలుగులోకి వచ్చింది

బాలీవుడ్‌ నుంచి మళ్లీ తెలుగులోకి వచ్చింది

టాలీవుడ్‌లో చాలా కాలం పాటు హవాను చూపించిన ఇలియానా.. ఇక్కడ పరిస్థితి అనకూలంగా లేకపోవడంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మాత్రం మొదటి సినిమాతోనే మెప్పించి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత అక్కడ ఫుల్ బిజీ అయిపోయింది. ఇలాంటి సమయంలోనే 'అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా ఇలియానా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చినా నిరాశనే ఎదుర్కొంది.

విదేశీయుడితో ప్రేమాయణం.. బ్రేకప్ చెప్పింది

విదేశీయుడితో ప్రేమాయణం.. బ్రేకప్ చెప్పింది

కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఈ గోవా చిన్నది ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో డేటింగ్ చేసింది. దీంతో అప్పటి నుంచి ఆమె కెరీర్ గాడి తప్పింది. ఇద్దరూ కలిసి గోవాలో ఓ ఇంటిలో ఉండడం.. ఎక్కడకు వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని కనిపించడం వంటి వాటితో ఆమె తరచూ వార్తల్లో నిలిచేది. కొన్నేళ్ల తర్వాత అతడికి బ్రేకప్ చెప్పేసిందీ బ్యూటీ.

అందులో యమా యాక్టివ్... హాట్ షోతో రచ్చ

అందులో యమా యాక్టివ్... హాట్ షోతో రచ్చ

సినిమాల్లో కనిపించకపోయినప్పటికీ ఇలియానాకు తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. అంటే ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌ అన్నమాట. తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోలకు బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. ఆమె ఫొటోలకు భారీ స్థాయిలో లైక్స్ కూడా వస్తుంటాయి.

సంచలన విషయాలు లీక్ చేసిన ఇలియానా

సంచలన విషయాలు లీక్ చేసిన ఇలియానా

తాజాగా ఇలియానా 'ద బిగ్ బుల్' అనే సినిమాలో నటించింది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలతో పాటు ఎన్నో అంశాలపై మాట్లాడింది. అదే సమయంలో తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలపై ఆమె స్పందించింది. ఈ క్రమంలోనే కొన్ని సంచలన విషయాలను లీక్ చేసి.. వాటన్నింటికీ క్లారిటీ ఇచ్చేసింది.

అతడి వల్ల ప్రెగ్నెంట్.. అబార్షన్ కూడా అంటూ

అతడి వల్ల ప్రెగ్నెంట్.. అబార్షన్ కూడా అంటూ

ఈ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఎన్నో రూమర్ల గురించి స్పందించింది ఇలియానా. 'నేను నా బాయ్‌ఫ్రెండ్ కారణంగా గర్భవతిని అయ్యాయని వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఆ తర్వాత నాకు అబార్షన్ కూడా అయినట్లు ప్రచారం జరిగింది. అసలు ఇందులో ఏమాత్రం నిజం లేదు. అసలు ఇలాంటివి ఎలా పుడతాయో.. ఎలా రాస్తారో అర్థం కావడం లేదు' అంటూ ఫైర్ అయిందీ చిన్నది.

Recommended Video

Jalsa Movie Philosophy And Review. it's 13 years for classic jalsa | Filmibeat Telugu
ఆత్మహత్య.. పని మనిషి వల్లే బతికిందంటూ

ఆత్మహత్య.. పని మనిషి వల్లే బతికిందంటూ

ఇలియానా ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్తలపై స్పందిస్తూ.. 'నేను ఆత్మహత్య చేసుకోబోయానని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు, నా పని మనిషి వల్లే బతికానని అన్నారు. నిజానికి అలా ఏం జరగలేదు. అసలు మా ఇంట్లో పని పనిషే లేదు. ఇలాంటి ప్రచారాలు చాలానే జరిగాయి. ఇది చాలా అనైతికం.. దారుణం. ఇకనైనా అవి ఆపేయాలి' అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X