కన్న కొడుకుపై ఇలియానా సంచలన పోస్ట్.. నా తీరు ఇంతే అంటూ
టాలీవుడ్ కొన్నేళ్ల పాటు ఊపూపింది గోవా బ్యూటీ ఇలియానా. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'పోకిరి' చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. స్టార్ హీరోల సరసన నటించి సౌత్ అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. తనకంటూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. కానీ కొన్నాళ్లు ఇలియానా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపించడం లేదు. కేవలం బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తూ వస్తోంది. మళ్లీ తెలుగు చిత్రాల్లో ఎప్పుడూ నటిస్తుందా? అని ఆమె అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇలియానా తాజాగా తన కొడుకు గురించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచింది.
ఇలియానాకు గుర్తుంపు తెచ్చిన చిత్రాలివే..
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఇలియానాను వైవీఎస్ చౌదరి పరిచయం చేశారు. ఉస్తాద్ రామ్ పోతినేని సరసన 'దేవదాస్' చిత్రంలో నటించి టాలీవుడ్ లో అడుగు పెట్టింది. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగమ్మాయిలా మెరిసి ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుంది. ఇక ఆ తర్వాత మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవి తేజ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. పోకిరి, జల్సా, కిక్, జులాయి వంటి గుర్తుండిపోయే సినిమాల్లో నటించింది.

రహస్యంగా పెళ్లి చేసుకున్న ఇలియానా..
ఇలియానా డిక్రూజ్ 2019 వరకు ఆస్ట్రేలియన్ ఫొటో గ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమాయణం సాగించింది. రెండేళ్ల గాఢమైన ప్రేమ తర్వాత ఇలియానా అతనికి బ్రేక్ అప్ చెప్పింది. ఆ తర్వాత మైఖేల్ డోనాల్ అనే ఫారేన్ వ్యక్తితో 2023లో ఏకంగా రహస్యంగా పెళ్లి చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తను కొడుకు సంబంధించిన ఫొటోలను కూడా గతంలో ఇలియానే స్వయంగా అభిమానులతో పంచుకుంది.
కన్న కొడుకుపై ఇలియానా పోస్ట్ ఇలా..
2 ఏళ్ల వయస్సు ఉన్న తన కొడుకు గురించి ఇలియానా డిక్రూజ్ తాజాగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. తన ప్రేమ కోసం ఎదురు చూసేలా తన కొడుకును పెంచబోనని చెప్పింది. ఏ తల్లిదండ్రులైనా తమ ప్రేమను పిల్లలు కోరుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదని చెప్పుకొచ్చింది. వారిని అన్ని రకాలుగా తీర్చిదిద్దితే సరిపోతుందని, అలాగే ఎప్పుడూ వారి ప్రేమ అందుతూనే ఉందని తెలియజేసేందుకు వారిని ఆరోగ్యంగా, ఆర్థికంగా, దయకలిగిన పిల్లలుగా పెంచి పోషించాలని చెప్పుకొచ్చింది. ఇలా తనకు కొడుకు గురించి ఇన్ స్టాలో తనకు ఎదురైనా ప్రశ్నకు చెప్పుకొచ్చింది. ఆ పోస్ట్ ను తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలోనూ షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఇక ఇలియానా ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉందని, తన రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తోందని తెలుస్తోంది.
తెలుగు సినిమాలకు నో.. ఓన్లీ బాలీవుడ్..
ఇలియానా డిక్రూజ్ 2012 తర్వాత సౌత్ చిత్రాల్లో నటించడం ఆపేసింది. కోలీవుడ్ లో జరిగిన ఒక ఘటనతో ఆమెకు దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలు ఆగిపోయాయి. దీంతో అప్పటి నుంచి బాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. మధ్యలో కరోనాకు ముందు 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంతో తిరిగి టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ హిందీ బాటనే పట్టింది. చివరిగా హిందీలో 'దో ఔర్ దో ప్యార్' చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించింది.


Click it and Unblock the Notifications











