నీ మీద ప్రేమను తెలిపేందుకు మాటలు చాలవు: ఇలియానా ఎమోషనల్ పోస్ట్
స్టార్ హీరోయిన్ ఇలియానా.. ఈ పేరు తెలియని తెలుగు వాళ్లు ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో మెరిసి టాప్ హీరోయిన్‌గా ఎదిగిందీ ఈ గోవా బ్యూటీ. ఇక్కడ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. టాలీవుడ్‌లోని ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే, అదే సమయంలో దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వాలన్న భావనతో టాలీవుడ్‌కు బాయ్ చెప్పేసింది.
హిందీలో ఆమె నటించిన 'బర్ఫీ' మినహా మిగిలిన సినిమాలేవీ అంతగా ఆడకపోవడంతో గోవా బ్యూటీ పని అయిపోయింది. ఇలియానా నటించిన చిత్రాలన్నీ వరసగా వైఫల్యాలు చెందడంతో అటు బాలీవుడ్‌లోను ఇటు టాలీవుడ్‌లోను అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. అలాంటి సమయంలో కోలీవుడ్‌లో శంకర్ దర్శకత్వంలో 'త్రీఇడియట్స్' హిందీ రీమేక్ 'నన్బన్'లో విజయ్ సరసన నటించింది. ఆ చిత్రం ఘనవిజయం సాధించినా ఎందుకనో ఇలియానాకు అవకాశాలు రాలేదు.

తాజాగా తన తల్లి పుట్టినరోజు (బుధవారం)ను పురస్కరించుకుని ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'నువ్వే నా బలం, బలహీనత, నువ్వే నా సర్వస్వం. నీ మీద ప్రేమను తెలిపేందుకు మాటలు చాలవు. నువ్వు నా కోసం చేసిన, చేస్తున్న ఎన్నో పనులకు ధన్యవాదాలు. సూపర్ ఉమెన్, సూపర్ అమ్మ. ఐ లవ్ యూ' అని ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు దాదాపు రెండున్నర లక్షలకు పైగా లైకులు రావడం విశేషం.
ఇక, చాలా రోజుల తర్వాత తెలుగులో రవితేజ సరసన నటించింది ఈ అమ్మడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా ఇలియానా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించకపోవడంతో ఆమెకు నిరాశ తప్పలేదు. ఆ సినిమా తర్వాత ఇల్లీ బేబీ మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తోంది.


Click it and Unblock the Notifications











