దారుణమైన పరిస్థితిలో ఇలియానా.. దాని కోసం దిగజారేందుకు రెడీ!
ఇండస్ట్రీకి హీరోయిన్లు కొదువే కాదు.రోజుకో హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయమవుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెంబర్ 1 ర్యాంక్ ల కోసం ఏ హీరోయిన్ పోరాడడం లేదు. ఎప్పుడు ఏ హీరోయిన్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుందో చెప్పలేని పొజిషన్ లో ఉన్నారు. ఇక ఇలాంటి సమయంలో సీనియర్ హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది.
ఇక వారి అందానికి, అభినయానికి తగ్గ పాత్రలు రావడం లేదు.. అలా అని అక్క, వదిన పాత్రలు చేసే వయస్సు కూడా కాదు. దీంతో చాలామంది సీనియర్ హీరోయిన్లు ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నారు. మరికొంతమంది.. తాము ఐటెంసాంగ్స్ చేయడానికి కూడా సిద్ధం అంటున్నారు. అలా దారుణమైన పరిస్థితిని ప్రస్తుతం గోవా బ్యూటీ ఇలియానా ఎదుర్కొంటుందని టాక్ నడుస్తోంది.

దేవదాసు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ ఇలియానా. ఆమె నడుముకు అప్పట్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఆమె నడుము చూసాక బయట ఏ అమ్మాయి నడుమును పొగడాలి అన్నా ఇలియానా నడుము అని పోల్చేవారు. అంతలా ఈ బ్యూటీ మెస్మరైజ్ చేసి మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఇల్లు బేబీ ఒక్కసారిగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైంది. అందుకు కారణం.. ఆమె బ్రేకప్.
ఇక దానివలన కొన్నాళ్ళు టాలీవుడ్ కు బ్రేక్ ఇచ్చిన ఈ భామ.. ఆ తరువాత అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. అప్పటికే ఇల్లు బేబీ కి ఉన్న అందం మొత్తం పోవడంతో ప్రేక్షకులు ఆమెను అంతగా రిసీవ్ చేసుకోలేదు. దీంతో ఈ చిన్నది బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కూడా అమ్మడి కెరీర్ అంతంత మాత్రంగానే సాగింది. అలా కొన్నేళ్లు గడిపిన ఇలియానా .. పెళ్లి కాకుండానే తల్లిగా మారి షాక్ ఇచ్చింది.

అసలు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనేది చెప్పకుండా చాలా సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఇక చివరికి తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసి కథను సుఖాంతం చేసింది. తల్లి అయ్యాకా.. ఇలియానా మళ్లీ సౌత్ లో అడుగుపెట్టడానికి చాలా ప్రయత్నాలు సాగిస్తుంది. ఎలాగైనా తెలుగులో మళ్లీ క్లిక్ అవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇలియానా తనకు ఛాన్స్ లు ఇవ్వాలని కోరింది. అది కూడా ఐటెంసాంగ్స్ అయినా పర్లేదని చెప్పుకొచ్చింది. " ఒక బిడ్డకు తల్లి అయినా నేను ఇంకా సినిమాలు చేయాలనుకుంటున్నాను. హీరోయిన్ గా తీసుకోకపోయినా.. ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా నేను సిద్ధం. పారితోషికం విషయంలో కూడా ఎలాంటి పట్టింపులు లేవు" అని కూడా చెప్పుకొచ్చింది. ఇక అందాల ఆరబోతకు అమ్మడు ఎప్పుడు నో చెప్పింది లేదు. దీంతో ఈ చిన్నది ఎంతగా టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వడానికి ఆరాటపడుతుందో కనిపిస్తుంది.

ఇక నిజం చెప్పాలంటే హీరోయిన్ గా కాకుండా ఐటెంసాంగ్స్ తో అమ్మడికి మంచి పేరు వచ్చేలా ఉందని చెప్పొచ్చు. అందుకు కారణం.. ఇప్పుడు ఐటెం సాంగ్స్ అంటే.. వీరే చేయాలనీ రూల్ లేదు. స్టార్ హీరోయిన్స్ చేయడం ట్రెండ్. ఇలాంటి సమయంలో ఇలియానా.. స్టార్ హీరో సరసన ఒక్క సాంగ్ చేస్తే చాలు. అమ్మడు మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందొచ్చు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇలియానాకు ఆ ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరో చూడాలి.


Click it and Unblock the Notifications











