నడుము సుందరి ఇలియానా ఇలా అయిపోయిందా.. ఫోటోలు వైరల్!
Recommended Video

దేవదాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా పోకిరి చిత్రంతో యువతని ఒక ఊపు ఊపేసింది. ఇలియానా నడుము అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆ తరువాత ఇలియానా చాలా కాలం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. జులాయి చిత్రం తరువాత ఇలియానా తెలుగు తెరకు దూరం అయిపోయింది. వరుస పరాజయాలు ఓ కారణం అయితే.. బాలీవుడ్ కి ఆకర్షితురాలు కావడం మరో కారణం. తాజగా అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది.

రీఎంట్రీ చిత్రం
అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలోని డాన్ బాస్కో అనే వీడియో సాంగ్ ప్రోమో విడుదల చేసారు. ఈ సాంగ్ వినగానే ఆకట్టుకునే విధంగా ఉంది. తెలుగు యువత ఇలియానా స్టెప్పులు చూసి చాలా కాలం అవడంతో ఈ వీడియో వైరల్ గా మారుతోంది. అందరూ ఇలియానా గురించే చర్చించుకుంటున్నారు.
బొద్దుగా మారిపోయింది
ఈ సాంగ్ లో ఇలియానాని చూసినవారంతా బొద్దుగా మారిపోయిందని పెదవి విరుస్తున్నారు. ఒకప్పుడు నడుము అందంతో అలరించిన ఇలియానా ఇప్పుడేంటి ఇంత బరువెక్కింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి. వాస్తవానికి చాలా రోజుల క్రితం నుంచే ఇలియానా బరువు పెరుగుతోంది. ఈ సాంగ్ లో ధరించిన కాస్ట్యూమ్స్ వలన ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది.

రూమర్స్ వినిపించాయి
కొన్నిరోజుల క్రితం అయితే ఇలియానా గర్భవతి అంటూ కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఆ వార్తలపై ఇలియానా క్లారిటీ ఇచ్చింది. కానీ ఇలా బొద్దుగా మారుతూ ఫిజిక్ పై ఎందుకు దృష్టి పెట్టడం లేదు ఈ భామ అనే ప్రశ్న తలెత్తుతోంది.

శ్రీనువైట్ల దర్శత్వంలో
వరుస పరాజయాలో ఉన్న శ్రీనువైట్ల రవితేజతో తెరకెక్కిస్తున్న నాల్గవ చిత్రం ఇది. ఇలియానా అయితే మంచి క్రేజ్ వస్తుందని భావించాడో ఏమో కానీ ఏరికోరి మరి ఈ అమ్మడిని హీరోయిన్ గా పెట్టుకున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న అమర్ అక్బర్ ఆంటోని చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టింది.


Click it and Unblock the Notifications











