వెరీ ఇంట్రెస్టింగ్: మహేశ్, బన్నీ సినిమాలకు నో చెప్పిన ఇలియానా.. ఎందుకిలా చేసిందబ్బా.!
స్టార్ హీరోయిన్ ఇలియానా.. ఈ పేరు తెలియని తెలుగు వాళ్లు ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో మెరిసి టాప్ హీరోయిన్‌గా ఎదిగిందీ ఈ గోవా బ్యూటీ. ఇక్కడ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లోని ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే, అదే సమయంలో దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వాలన్న భావనతో టాలీవుడ్‌కు బాయ్ చెప్పేసింది. హిందీలో ఆమె నటించిన 'బర్ఫీ' మినహా మిగిలిన సినిమాలేవీ అంతగా ఆడకపోవడంతో గోవా బ్యూటీ పని అయిపోయింది. ఇలియానా నటించిన చిత్రాలన్నీ వరసగా వైఫల్యాలు చెందడంతో అటు బాలీవుడ్‌లోను ఇటు టాలీవుడ్‌లోను అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. తాజాగా ఆమె ఓ షాకింగ్ డెసీషన్ తీసుకుందట. ఇంతకీ ఏంటది.?

అక్కడ ఆమె అందాలు కనువిందు
ఇలియానా.. సినిమాల్లో కనిపించకపోయినప్పటికీ తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. అంటే ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ అన్నమాట. తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోలకు బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. ఆమె ఫొటోలకు భారీ స్థాయిలో లైక్స్ కూడా వస్తుంటాయి. సినిమాల్లో నటించకున్నా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

కిక్కిస్తుందేమో అనుకుంటే...
చాలా రోజుల తర్వాత తెలుగులో రవితేజ సరసన నటించింది ఈ అమ్మడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా ఇలియానా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించకపోవడంతో ఆమెకు నిరాశ తప్పలేదు. ఆ సినిమా తర్వాత ఇల్లీ బేబీ మళ్లీ కనిపించలేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఖతర్నాక్', ‘కిక్', ‘దేవుడు చేసిన మనుషులు' అనే సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

చిరంజీవితో షేర్ చేసుకుంటుంది
మెగాస్టార్ చిరంజీవి - టాప్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో మెరిసి టాప్ హీరోయిన్‌గా ఎదిగిన గోవా బ్యూటీ ఇలియానాను తీసుకోబోతున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో టాలీవుడ్‌లోని ఆమె అభిమానులు తెగ సంబరపడిపోయారు. అయితే, ఆమెను చిత్ర యూనిట్ అసలు సంప్రదించనే లేదనే వార్త బయటకు రావడంతో దీనికి బ్రేక్ పడింది.

మహేశ్, బన్నీ సినిమాలకు నో
సంక్రాంతికి రాబోతున్న మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో' సినిమాలకు ఇలియానాకు అవకాశం వచ్చిందట. అయితే, వాటిలో ఆమె హీరోయిన్‌గా కాదు.. స్పెషల్ సాంగ్స్ చేయడానికని సమాచారం. ఈ రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఇల్లీ బేబి వాటిని వదులుకుందని తాజాగా ఓ వార్త ఫిలిం నగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. దీనికి గల కారణాలు మాత్రం తెలియ రాలేదు.
Recommended Video

వాళ్లిద్దరితో స్క్రిన్ షేర్ చేసుకుంది
గతంలో ఇలియానా.. మహేశ్ బాబు, అల్లు అర్జున్‌తో స్క్రిన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. మహేశ్‌తో చేసిన ‘పోకిరి', బన్నీతో కలిసి నటించిన ‘జులాయి'లో ఆమె నటించింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. హిట్ కాంబినేషన్ అయినప్పటికీ ఇలియానా ఈ ఇద్దరు హీరోల సినిమాల్లో ఇప్పటి వరకు కనిపించలేదు. ఇప్పుడేమో స్పెషల్ సాంగ్స్ రూపంలో ఆఫర్ వచ్చినా వదులుకుందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











