గర్భవతిని అని అన్నారు.. వారం రోజులు ఇంట్లో నుంచి బయటకు రాలేదు.. ఇలియానా!
Recommended Video

ఇలియానా పేరు చెప్పగానే పోకిరి, జల్సా, జులాయి, కిక్ లాంటి చిత్రాలు కళ్ళముందు మెదులుతాయి. నడుము అందంతో ఇలియానా తెలుగు కుర్రకారులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. పోకిరి చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఇలియానా చాలా కాలం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. జులాయి, దేవుడు చేసిన మనుషులు చిత్రం తరువాత ఇలియానా దాదాపు ఆరేళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం అయింది. ఇప్పుడు తాజాగా అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో రీ ఎంట్రీకి సిద్ధం అయింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఇలియానా ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఇంత గ్యాప్ ఎందుకంటే
తెలుగులో తన కెరీర్ ఆరంభంలో వరుసగా అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ కు వెళ్లిన తరువాత కూడా ఆదేవిందంగా అవకాశాలు వచ్చాయి. మంచి కథ కుదిరితే తెలుగులో మళ్ళీ నటించాలని అనుకున్నా. కానీ ఇంత గ్యాప్ వస్తుందని అనుకోలేదు. మొత్తానికి అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇలియానా తెలిపింది. బాలీవుడ్ కు మాత్రమే పరిమితం కావాలనే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చింది.

దేవదాస్ తరువాత
తెలుగు సినిమాలో ఇన్నేళ్ల కాలంలో చాలా మార్పులు వచ్చాయని ఇలియానా తెలిపింది. నా తొలి చిత్రం దేవదాస్ కు బాగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఆ తరువాత నటించిన చిత్రాలకు పెద్దగా ప్రచారం నిర్వహించింది లేదు. కానీ ఇప్పుడు ప్రతి చిత్రానికి నెలరోజుల ముందు నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారని ఇలియానా తెలిపింది.

శ్రీనువైట్ల డెసిషన్
అమర్ అక్బర్ ఆంటోనికి నేనే డబ్బింగ్ చెప్పాలనేది శ్రీనువైట్ల డెసిషన్. డబ్బింగ్ చెప్పాలని అడిగినప్పుడు భయం వేసింది. తెలుగు నాకు చాలా బాగా అర్థం అవుతుంది. కానీ పదాలు స్పష్టంగా పలకలేను. కానీ శ్రీనువైట్ల అందించిన ప్రోత్సాహం వల్ల డబ్బింగ్ పూర్తి చేసినట్లు ఇలియానా తెలిపింది.

గర్భవతిని అని అన్నారు
తనకు పెళ్లయింది అంటూ వస్తున్న వార్తల గురించి ఇలియానా స్పందించింది. గర్భవతిని అంటూ కూడా ప్రచారం చేశారు. ఆ వార్తల గురించి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూనే ఉన్నా. అయినా నా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు అని ఇలియానా తెలిపింది.

ఆ వార్తలు నిజమే
తాను మానసిక సమస్యలతో బాధపడిన మాట వాస్తవమే అని ఇలియానా తెలిపింది. ఆ సమయంలో వారం రోజులపాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఎవ్వరితోనే మాట్లాడేదానిని కాదు. సమస్య గురించి పూర్తిగా తెలుసుకుని జాగ్రత్తలు పాటించా. అందువలనే ఆ సమస్య నుంచి బయటపడ్డా అని ఇలియానా చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











