ఇలియానా ఉదార స్వభావం.. మొత్తం చూపించేస్తూ పిచ్చెక్కిస్తోంది.. బికినీ పిక్ వైరల్
Recommended Video
ఇలియానా.. జీరోసైజ్ భామగా టాలీవుడ్‌ను ఓ ఊపుఊపేసింది. మొదటి సినిమాలోనే అందాలను ఆరబోసి కుర్రకారు గుండెల్ని గిలిగింతలు పెట్టేసింది. జీరో సైజ్ అంటూ నడుమును వయ్యారంగా ఊపుతూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది.

వరుస హిట్లతో దూసుకుపోయిన ఇలియానా..
దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. మొదటి చిత్రంతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అటుపై పోకిరి అంటూ ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది. ఇలా వరుస హిట్లతో దూసుకుపోయిన ఇలియాన.. బాలీవుడ్‌కు చెక్కేసి ఇక్కడి ప్రేక్షకులకు దూరమైంది.

కోటి భామగా ఫేమస్..
తెలుగు ఇండస్ట్రీలో కోటి తీసుకున్న మొదటి భామగా అప్పట్లో వార్తలు తెగ హల్ చల్ చేశాయి. ఆ సమయంలో ఇలియానాకు ఉన్న క్రేజ్ కూడా అలాంటిదే మరి. అయితే బాలీవుడ్‌కు పయనమయ్యాక కష్టాలు మొదలయ్యాయి. అక్కడ సరైన గుర్తింపు రాక మళ్లీ టాలీవుడ్ వైపు తొంగి చూసింది.

బాలీవుడ్ టు టాలీవుడ్...
బాలీవుడ్‌లో సరైన కమర్షియల్ సక్సెస్ కొట్టలేక వెనుకబడ్డ ఇలియానా తెలుగులో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆమె చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. తిరిగి మళ్లీ తట్టాబుట్టా సర్దేసుకుంది.
బికినీ ఫోటోలతో హల్ చల్..
ఒకప్పటి ప్రియుడు, ఫోటోగ్రఫర్ ఆండ్రూ నీబోన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగుతూ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉండేది. అయితే అతడితో బ్రేకప్ చేసుకున్నాక.. ఒంటరైన ఇలియానా సోషల్ మీడియాలో మరింత వేడిని రాజేస్తోంది.

మొత్తం ఫ్రీ అన్నట్టుగా..
తాజాగా ఓ బికినీ ఫోటోను షేర్ చేసి.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎండలో తిరిగితే నల్లగా అవుతానని తల్లి అంటున్నట్టుగా.. అయినా అవన్నీ తాను పట్టించుకోను అనిచెప్పినట్టు ఓ పోస్ట్ చేసింది. ఇక బికినీలో ఇలియానా అందాలను చూసిన అభిమానులకు పిచ్చెక్కుతోంది. ప్రస్తుతం పాగల్‌పంటి అనే చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమైంది.


Click it and Unblock the Notifications











