For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Illeana D'Cruz బికినీలో హల్‌చల్.. పెళ్లి చేసుకొందామా పద అంటూ నెటిజన్.. గోవా బ్యూటీ జవాబు ఏమిటంటే!

  |

  గతంలో వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకుల్లో హీట్ పెంచిన ఇలియానా డిక్రజ్ హవా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెండితెరపై కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాను మాత్రం ఘాటుగా వేడెక్కిస్తున్నది. ఇటీవల కాలంలో యాక్టింగ్ టాలెంట్ కంటే గ్లామర్ టాలెంట్‌ను బయటపెడుతూ ఇలియానా వార్తల్లో నిలుస్తున్నది. తాజాగా ఇలియానాకు సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నది. ఈ క్రమంలో ఇలియానా ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ విషయంలోకి వెళితే...

  ఒకప్పటి ట్రెడిషినల్ హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ ఫొటోస్.. ఇద్దరి పిల్లలు ఉన్నా కూడా అదే గ్లామర్!

  బిగ్‌బుల్‌లో జర్నలిస్టు పాత్ర

  బిగ్‌బుల్‌లో జర్నలిస్టు పాత్ర

  ఇలియానా ఇటీవల కాలంలో పెద్దగా సినిమాల్లో నటించిన దాఖలాలు లేవు. కానీ ఈ మధ్య అభిషేక్ బచ్చన్‌తో కలిసి ది బిగ్ బుల్ చిత్రంలో నటించింది. హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రముఖ జర్నలిస్టు సుచేతా దలాల్ పాత్రలో కనిపించింది. ఈ పాత్రకు క్రిటిక్స్, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

  తెలుగులో ఎక్కువ టీఆర్పీ రేటింగ్ సాధించిన సినిమాలు ఇవే: మహేశ్, బన్నీ రికార్డు.. పవన్‌కు దక్కని చోటు

  మాస్ మహారాజ రవితేజతో

  మాస్ మహారాజ రవితేజతో

  ఇక తెలుగులో నటించి రెండు సంవత్సరాలకు పైగానే అవుతుంది. చివరిసారిగా అమర్ అక్బర్ ఆంథోని చిత్రంలో మాస్ మహారాజా రవితేజతో నటించింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటంతో మళ్లీ టాలీవుడ్ వైపు ఇలియానా ముఖం చూపించలేదు. ఇక హిందీలో అన్ ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంలో నటిస్తున్నారు.

  ‘వల్లంకి పిట్ట' పాప ఇప్పుడెలా ఉందో తెలుసా.. హీరోయిన్స్ ని మించి పోయిందిగా!

  ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్

  ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్

  ఇక వ్యక్తిగత జీవితంలోకి వెళితే.. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ అండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేస్తున్నారు. అయితే మీడియాలో వీరిద్దరి బంధంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు అని, అలాగే వారిద్దరి బ్రేకప్ చెప్పుకొన్నారు అనే విషయాలు మీడియాలో కనిపించాయి. కాకపోతే ఈ వార్తలపై ఇలియానా పెద్దగా స్పందించలేదు.

  విదేశీ విహారయాత్రపై కన్నేసిన భామ

  విదేశీ విహారయాత్రపై కన్నేసిన భామ

  డేటింగ్, బ్రేకప్ వార్తల మధ్య ఇలియానా లాక్‌డౌన్ జీవితాన్ని ఎంజాయ్ చేసినట్టు కనిపించారు. లాక్‌డౌన్ జీవితం నుంచి బోర్ కొట్టిన ఆమె త్వరలోనే ఓ విదేశీ యాత్రకు ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. ఆ క్రమంలోనే గతంలో విదేశీ టూరుకు వెళ్లోచ్చిన మెమొరీస్‌ను పంచుకొన్నారు. బెలిజీలోని శాన్ పెడ్రోకు వెల్లి వచ్చిన ఫోటోను షేర్ చేశారు. త్వరలోనే మరో మంచి అనుభూతిని పొందేందుకు సిద్దమవుతున్నాను అని ఇలియానా హింట్ ఇచ్చారు.

  పెళ్లి చేసుకొని ఆశ్చర్యం కలిగిద్దామా?

  పెళ్లి చేసుకొని ఆశ్చర్యం కలిగిద్దామా?

  నా గత అనుభవాలను మీతో నా హృదయం పంచుకోవాలనుకొంటున్నది అని ఇలియానా అంటే.. ఓ తుంటరి నెటిజన్ మనం పెళ్లి చేసుకొని మన పేరెంట్స్‌ను ఆశ్చర్యానికి గురిచేద్దామా అంటూ కామెంట్ చేశారు. దాంతో ఆ కామెంట్‌ వైరల్ అయింది. అయితే ఇలియానా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా జాగ్రత్త పడింది.

  8 లక్షల మంది లైకులు కొట్టడంతో వైరల్

  8 లక్షల మంది లైకులు కొట్టడంతో వైరల్


  ఇలియానా షేర్ చేసిన ఫోటో కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. దాదాపు 8 లక్షల మంది లైక్ కొట్టారు. దాదాపు వేలాది మంది కామెంట్లు పెట్టారు. పచ్చని బికినీలో ఉన్న మీరు చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి బికినీలో తన అందాలను మరోసారి రుచి చూపించి నెటజిన్లను తెగ ఆకట్టుకొంటున్నారు.

  English summary
  Actor Illeana D'Cruz Cleavage show in yellow bikini photo goes viral. She shared in her instagram that, Too soon for a throwback??. This photo goes viral and 8 lakhs people liked in few hours.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X