Remuneration: యూట్యూబర్‌గా ఇమాన్ ఇస్మాయిల్ ఆదాయం 2 లక్షలు. ప్రభాస్ సినిమాకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎప్పటికప్పుడు తెలుగు సినిమా దగ్గర కోట హీరోయిన్స్ కి ఏమీ మారుతున్న ట్రెండ్ లో భాగంగా కొత్త కొత్త ఫేస్ లు టాలీవుడ్ లో వచ్చి పలకరిస్తూ ఉంటాయి. కాగా ఇలా వచ్చిన లేటెస్ట్ హీరోయన్స్ ఇప్పుడు టాలీవుడ్ లో కొందరు ఉన్నారు. మరి వీరిలో శ్రీలీల, కృతి శెట్టిలు ఆల్రెడీ సెటిల్ అయ్యారు. ఇక ఈ ఏడాదిలో భాగ్యశ్రీ అనే కొత్త అమ్మాయి వచ్చి సూపర్ గా ట్రెండ్ అవుతుండగా ఇప్పుడు మరో అమ్మాయి కోసం సోషల్ మీడియాలో ప్రజానీకం మాట్లాడుకుంటున్నారు.
కాగా ఆ హీరోయిన్ నే ఇమాన్ ఇస్మాయిల. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ ఆడియెన్స్ లో బాగా వైరల్ గా వినిపిస్తున్న పేరు కాగా.. ఈమె విషయంలో గత కొన్నాళ్ల నుంచి కూడా టాక్ ఉంది. పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఈమె కనిపిస్తుంది పలు రూమర్స్ ఆ మధ్య అంతా బాగా వైరల్ అయ్యాయి. అలాగే మొట్ట మొదటిసారి ప్రభాస్ ఒక పాకిస్తాన్ బ్యూటీతో రొమాన్స్ చేయనున్నాడు అంటూ కూడా టాక్ వచ్చింది.

తర్వాత మళ్ళీ ఆమె ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ అంటూ కూడా వినిపించింది కానీ మృణాల్ వాటికి చెక్ పెట్టింది. అయితే ఇప్పుడు నిన్న అనౌన్సమెంట్ తో ప్రభాస్ సరసన ఈ యంగ్ బ్యూటీ ఇమాన్ నే నటిస్తుంది అని కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇక ఇక్కడ నుంచి అంతా ఆమె కోసం మళ్ళీ వెతకడం స్టార్ట్ చేశారు. అయితే ఈమె ఇపుడు ఈ సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.
ఇమాన్ ఇస్మాయిల్ ఇన్స్టాగ్రామ్ లో ఇంఫ్యూయెన్సర్ మాత్రమే కాకుండా యూట్యూబ్ నుంచి కూడా బాగానే సంపాదిస్తుందట. ఒక్క యూట్యూబ్ నుంచే ఈమె ఒక్క నెలలో 4 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తుందట. అలాగే ఇన్స్టా నుంచి కూడా ఆమె బాగానే సంపాదిస్తుంది. మరి ఇప్పుడు ప్రభాస్ లాంటి స్టార్ తో సినిమా చేస్తుండగా దీనికి ఈమె పెద్ద మొత్తమే అందుకునే ఛాన్స్ ఉందని చెప్పాలి.
కాగా ఈమె ఈ చిత్రానికి ఈజీగా 1 కోటికి పైగానే అందుకే ఛాన్స్ ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఐతే ఈమె తెలుగులో గట్టి ఎంట్రీ ఇవ్వబోతుంది అని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రాన్ని కూడా హను రాఘవపూడి పీరియాడిక్ నేపథ్యంలో ప్లాన్ చేస్తుండగా ప్రభాస్ భారత్ సైన్యంలో ఒకడిగా కనిపిస్తాడని కన్ఫర్మ్ అయ్యింది.
అలాగే 1940 లో జరిగే కథగా ఒక ఫిక్షనల్ లైన్ తో అయితే దీనిని ప్లాన్ చేస్తుండగా భారీ హైప్ దీని చుట్టూతా నెలకొంది. ఇక ఈ సినిమా షూటింగ్ అతి తొందరలోనే మొదలు కానుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఇంకా టి సిరీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ భారీ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











